వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలోనే ఎందుకంటే!!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి కొనసాగుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ లు ఈరోజు వివాహం చేసుకుని ఒకటి కానున్నారు. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ జంట నేడు వివాహం చేసుకుంటోంది. మరి కాసేపట్లో ఇటలీలోని టస్కనీ లో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.

ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి ఇటలీలోని టస్కనీని ఎంపిక చేసుకుంది. అయితే వివాహం చేసుకోవడానికి ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది. వీరి పెళ్లికి ఇటలీని వేదిక చేసుకోవడం వెనుక బలమైన కారణం ఉందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

Interesting reason that VarunTej and LavanyaTripathi wedding in italy

ఇక అసలు విషయం ఏమిటి అంటే..ఆరడుగుల అందగాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి 2017లో మిస్టర్ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా సమయాల్లో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ సినిమా కూడా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమకు తొలి బీజం పడిన ఇటలీలోనే వారు ప్రస్తుతం ఒక్కటి కాబోతున్నారు. తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.

ప్రస్తుతం వారి ఇరువురి వివాహం వారి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్, నిహారిక మరియు లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరు కానున్నారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లిలో హంగామా చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+