'రాజధాని ఒక విస్పోటనం, వాస్తవం తెలిస్తే అమరావతి బూటకం బట్టబయలు!'
అమరావతి: రాజధాని అమరావతి విషయమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా ఆసక్తికర కథనం ఇచ్చింది. ఎస్ఏపీఎం జాతీయ సమన్వయకర్త రామకృష్ణం రాజు రాజధాని అమరావతి ఓ విస్ఫోటనమే అని పేర్కొన్నారని రాసింది.
ఆయన చెప్పారంటూ సాక్షి రాసిన వివరాల ప్రకారం... రాజధాని అమరావతి రాష్ట్రానికి ఓ విస్ఫోటనమే అన్నారని పేర్కొంది. రాజధాని పేరిట జరుగుతున్న వ్యవహారాలన్నీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణంగా, వ్యవసాయంగా.. ఇలా అన్ని విధాలా దెబ్బతీస్తుందని, ప్రగతికి కాదని చెప్పాడని పేర్కొంది.
ఓ నాయకుడు తన ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ప్రణాళికలు రచిస్తూ, వాటిని భూతద్దంలో గొప్పగా చిత్రీకరిస్తూ వ్యక్తిగత లబ్ధికి బాటలు వేసుకోవడం తప్ప మరొకటి కాదాని చెప్పారని పేర్కొంది. వాస్తవ విశ్లేషణలు జరిగితే అమరావతి బూటకం బట్టబయలవుతుందని రామకృష్ణమ రాజు అన్నారని పేర్కొంది.

అమరావతి పేరిట మహా విస్ఫోటనం జరుగుతోందని ఆయన పేర్కొన్నారని తెలిపింది. తాము మెరుగైన రాజధానిని వ్యతిరేకించడం లేదని, కానీ అవసరాలకు అనుగుణంగా వెళ్లాలి తప్ప స్వప్రయోజనాల కోసం పాకులాడవద్దన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారని రాసింది.
రాజధాని నిర్మాణానికి మూడు వేల ఎకరాలు చాలని, అన్ని వేల ఎకరాలు సమీకరించారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, అవినీతికి అని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొంది. దీనిని ప్రజలంతా ప్రశ్నించారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిలదీయాలని చెప్పారని పేర్కొంది.
ఓటుకు నోటు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటూ అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబును ప్రధాని మోడీ ఎలా సమర్థిస్తున్నారని ఆయన పేర్కొన్నారని తెలిపింది. రాజధాని పేరిట విదేశీ కంపెనీల ముందు మోకరిల్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొంది.












Click it and Unblock the Notifications