ఇంటర్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్, మేడారంలో భక్తులపై హిజ్రాల దాడి
హైదరాబాద్: ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధినిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్ధినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

మేడారంలో భక్తులపై హిజ్రాల దాడి
వరంగల్ జిల్లాలోని మేడారంలో నల్లగొండకు చెందిన ఇద్దరు భక్తులపై హిజ్రాలు దాడి చేశారు. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం నల్లగొండ నుంచి వచ్చిన భక్తులను హిజ్రాలు డబ్బుల కోసం వేధించారు. వారు ఎదురు తిరగడంతో హిజ్రాలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పత్తి లారీ బోల్తా పడి ఒకరి మృతి
వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్ శివారులో కల్వర్టుపై నుంచి వెళ్తున్న పత్తిలారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
విద్యార్థి కిడ్నాప్
నగరంలోని బంజారా హిల్స్‌లో నెంబర్ ప్లేట్ల కోసం కాలేజీ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కిడ్నాప్‌నకు దారితీసింది. విద్యార్థుల మధ్య గొడవ పెద్దది కావడంతో కొందరు విద్యార్థులు కలిసి తివారి వంశీ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారుని వెంబడించి కిడ్నాపర్లను పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications