జగన్ కొత్త ప్రభుత్వంలో హోం మంత్రి ఎవరు - ఎవరికి ఏ శాఖ..!?
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు. తామే గెలుస్తామని టీడీపీ కూటమి నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఎవరికి వారు గెలుపు పైన ధీమాగా ఉన్నా...లోలోపల మాత్రం టెన్షన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, గెలుపు ఖాయమని భావిస్తున్న వారు మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకుంటున్నారు.
గెలుపు పై ధీమా
జగన్ తాము 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పిన మాటలు వైసీపీలో కొత్త లెక్కలకు కారణమవుతున్నాయి. హోరా హోరీగా సాగిన ఎన్నికల యుద్దంలో ఫలితం అంతు చిక్కనిదిగా ఉంది. జగన్ చెప్పిన మాటలతో వైసీపీ నేతల్లో ధీమా పెరిగింది. జగన్ చెప్పారంటే గెలిచినట్లేననే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుత మంత్రులు సైతం పోలింగ్ సరళి..గెలుపు అవకాశాల పైన పదే పదే సమీక్ష చేస్తున్నారు. కొందరు తమ గెలుపు పైన స్పష్టతతో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఈ నెల 30న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. చంద్రబాబు మరో రెండు రోజుల్లో అమరావతికి తిరిగి రానున్నారు.

భవిష్యత్ ఆశలు
ఇప్పటికే పోస్ట్ పోల్ చేస్తున్న సర్వే సంస్థల నుంచి తమ గెలుపు అవకాశాల గురించి అభ్యర్దులు ఆరా తీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే తమ గెలుపు ఖాయమని భావిస్తున్న నేతలు మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకుంటున్నారు. జగన్ గత అయిదేళ్ల కాలంలో హోం శాఖ మహిళకే కేటాయించారు. ఎస్సీ మహిళలకే అవకాశం కల్పించారు. ఈ సారి తిరిగి అధికారంలోకి వస్తే బీసీ మహిళకు హోం శాఖ ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇందు కోసం గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేసిన రజనీ పేరు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. పవన్ పైన పోటీ చేసిన వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తామని జగన్ నాడు పిఠాపురంలో ప్రచారం ముగింపు సభలో చెప్పారు.

మంత్రులయ్యేది ఎవరు
వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని భావిస్తున్న సీనియర్లు..జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని ప్రకటించారు. విశాఖలో జగన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందనే అంచనాలతో..ముందుగానే పార్టీ నేతలు విశాఖలో హోటళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ ధీమాతో ఫలితాలు రాకముందే మంత్రి పదవుల పైన చర్చలు మొదలయ్యాయి. జగన్ మరోసారి సీఎం అయితే సీనియర్లు బొత్సా, పెద్దిరెడ్డి, బాలినేని కి తిరిగి మంత్రి పదవులు ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. వీరితో పాటుగా ఈ సారి మహిళల మంత్రుల సంఖ్య పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. అయితే, అసలు ఎన్నికల ఫలితాలు రాకుండానే పార్టీలో ఈ చర్చ ఏంటనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతొ..జూన్ 4న ఎన్నికల ఫలితాల తరువాతనే ఈ అన్నింటి పైనా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications