వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణుకు వైసీపీలో వర్గపోరు; వెన్నుపోటు పొడుస్తున్నారని సొంతపార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి హాట్ కామెంట్స

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు బయటపడ్డాయి. వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరులో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తణుకులో వైయస్సార్ పెన్షన్ కానుక సాక్షిగా బయటపడ్డ విభేదాలతో సొంత పార్టీ నేతల పైన ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనపై కొంతమంది దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నారని, గత ఎన్నికల నుండే తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కారుమూరి నాగేశ్వరరావు.

మరో మూడుసార్లు సీఎం జగనే.. తమ్మినేని; సింహాన్ని ఎన్ని జంతువులు ఏకమైనా ఏం చెయ్యలేవన్న ధర్మానమరో మూడుసార్లు సీఎం జగనే.. తమ్మినేని; సింహాన్ని ఎన్ని జంతువులు ఏకమైనా ఏం చెయ్యలేవన్న ధర్మాన

 తమ్ముడూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నావా.. తణుకు ఎమ్మెల్యే ఫైర్

తమ్ముడూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నావా.. తణుకు ఎమ్మెల్యే ఫైర్

తణుకు వైసీపీ లో అసలేం జరిగిందంటే ఈ నెల 2వ తేదీన తణుకులో వైయస్సార్ పెన్షన్ కానుకను ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, తణుకు వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు సాయి రామ్ రెడ్డి ప్రారంభించారు . ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాను లేకుండా కార్యక్రమాన్ని ఎలా చేస్తారని టౌన్ ప్రెసిడెంట్ సాయి రామ్ రెడ్డి నిలదీశారు. తమ్ముడూ వెన్నుపోటు రాజకీయం చేస్తున్నావా అంటూ మండిపడ్డారు. ఈ సమయంలో తన తల్లిని తిట్టారని చెబుతూ తనను బూతులు తిట్టాడు అంటూ తణుకు టౌన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామాచేసాడు సాయి రామ్ రెడ్డి.

 సీఎం కార్యక్రమమే కొంప ముంచిందని కారుమూరి ఆవేదన

సీఎం కార్యక్రమమే కొంప ముంచిందని కారుమూరి ఆవేదన


తణుకులో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కారుమూరి మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం ని తీసుకువచ్చి తాను బర్త్ డే చేశాను అని అదే తన కొంపముంచింది అంటూ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వాపోయారు. సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కారుమూరి ఇక్కడ అర్జంటుగా ఓ వ్యక్తి ఎమ్మెల్యే పోవాలని కోరుకుంటున్నారు అంటూ సాయి రామ్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ అనుమానం వ్యక్తం చేశారు. తణుకులో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని, ఎదురుగా వచ్చే వారితో పోరాడ వచ్చు కానీ వెనక నుండి పొడిచేస్తున్నారు అంటూ కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తనపై కొంత మంది కుట్రలు చేస్తున్నారు : కారుమూరి ఆగ్రహం

తనపై కొంత మంది కుట్రలు చేస్తున్నారు : కారుమూరి ఆగ్రహం

తాను చాలా క్రమశిక్షణతో ఎదిగానని జడ్పిటిసిగా, ఎమ్మెల్యేగా పని చేశానని, తాను ఎవరికీ అపకారం చేయలేదని ఆయన అన్నారు. ఇక ఇదే సమయంలో తన ఫ్లెక్సీలు తాను వేసుకోనని కార్యకర్తలే వేస్తారని చెప్పిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి, తన వెనుక కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ లుకలుకలు ఇప్పుడు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. శత్రువుకి కూడా ఉపకారం చేశానని కారుమూరి స్పష్టం చేశారు. తాను లోకల్ ఎమ్మెల్యే అయినా వంక రవి ఫ్లెక్సీలో తన ఫోటో వేయలేదు అంటూ పేర్కొన్నారు.

 తాను లేకుండా పెన్షన్ ల కార్యక్రమం చేస్తారా ? ఎమ్మెల్యే ప్రశ్న

తాను లేకుండా పెన్షన్ ల కార్యక్రమం చేస్తారా ? ఎమ్మెల్యే ప్రశ్న

తాను లేకుండా వంక రవి పార్టీ పక్కన పెట్టిన సాయి రామ్ అనే వ్యక్తి ని తీసుకువచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టాడు అని అందుకే తను చిరాకు పడ్డానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను ఎవరినీ దూషించలేదనీ, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరినో కొట్టించేస్తానని, తన వల్ల ప్రాణ హాని ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. మా నియోజకవర్గంలో రెడ్లు అందరూ తనకు మద్దతుగా నిలిచారని ఎల్లుండి మూడు మండలాల నాయకులు జిల్లా ఇన్చార్జి సుబ్బారెడ్డిని కలుస్తారని పేర్కొన్నారు.

Recommended Video

Chandrababu Cried Issue : Vallabhaneni Vamsi Apologizes || Oneindia Telugu
తణుకు వైసీపీలో ప్రోటోకాల్ రగడ ..

తణుకు వైసీపీలో ప్రోటోకాల్ రగడ ..

జిల్లా ఇన్చార్జి సుబ్బారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేశానని కొంతమందికి తనపై ఈర్ష్యగా ఉందని కారుమూరి పేర్కొన్నారు. ఏదేమైనా తణుకు లో చోటుచేసుకున్న ప్రొటోకాల్ రగడ కారుమూరి నాగేశ్వరరావు వర్సెస్ తమ్ముడు సాయి రామ్ రెడ్డి అన్నట్టుగా సాగుతుంది. మరి ఈ వ్యవహారంలో, వీరి అంతర్గత కలహాలకు చెక్ పెట్టడానికి పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

English summary
Tanuku MLA Allegations against own party leaders in YSR pension Kanuka program in Tanuku. Tanuku MLA Karumuri Nageswara Rao is furious over some evil forces were conspiring against him and working against him since the last election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X