International Yoga Day 2025: యోగాంధ్రలో ప్రధాని మోదీ..విశాఖకు అరుదైన రికార్డు..!!
International Yoga Day 2025 live updates: యోగా అనేది కేవలం శరీర వ్యాయమమే కాదు.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ఘనమైన కార్యక్రమం. యోగా సంగం 2025 పేరుతో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న యోగా వేడుకకు భారత్ సిద్ధమైంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారత్‌లో లక్షకు పైగా వేదికలు, కొన్ని లక్షల మంది ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. చరిత్ర గర్వగా చెప్పుకునేలా శ్వాస, శరీరం, సఖ్యత ఒకే గొడుగు కిందకు రానున్నాయి. "ఒక భూమి.. ఒక ఆరోగ్యం కోసం యోగా" అనేది ఈ ఏడాది యోగా థీమ్‌గా ఉంది.
ఇక ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో స్వయంగా పాల్గొని యోగాసనాలు వేయనున్నారు.విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి 26 కిలోమీటర్ల పొడవున అంటే భోగాపురం వరకు యోగా కారిడార్‌ను తయారు చేసింది ఏపీ ప్రభుత్వం.

దాదాపు 3 లక్షల మంది యోగాసనాలు వేస్తారు.వరల్డ్ రికార్డులతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఈ వేడుకకు చోటు దక్కనుంది. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.
Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2025






















Click it and Unblock the Notifications