పెట్టుబడులన్నీహైద్రాబాద్‌లోనే, సిఎం దేనికైనా: లగడపాటి

హైదరాబాద్/విజయవాడ: మన పెట్టుబడులు అన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కృష్ణా జిల్లాలో అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం దేనికైనా సిద్ధమన్నారు. మన సొమ్మును దోచుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. సమైక్యత కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు.

జాతీయ నేతలను కలుస్తాం: మైసూరా

ఆర్టికల్ 3 సవరణకు, పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఓడించాలని తాము జాతీయ పార్టీల నేతలను కోరుతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మైసూరా రెడ్డి వేరుగా అన్నారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని, దానిని సవరించాలన్నరు. రేపు సిపిఐ, సిపిఎంలను, 17న బిజెపిని కలుస్తామన్నారు.

 Lagadapati Rajagopal

ప్రభుత్వాన్ని పడగొడితేనే: పయ్యావుల

ప్రభుత్వాన్ని పడగొడితేనే విభజన ఆగుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లాలో అన్నారు. విభజనపై బిల్లు పెట్టే సమయంలో అవిశ్వాసం పెట్టలేమన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అందరూ గవర్నర్‌ను కలిసి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలన్నారు.

కాగా, ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ ప్రాంత నేతలు 17న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న జివోఎంతో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+