హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫస్ట్ డే 2లక్షలకోట్ల పెట్టుబడులు: 'బాబు ధీరోదాత్తుడు', ఇవీ పెట్టుబడులు.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలోని విశాఖలో రెండోరోజు భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. సోమవారం నాటి సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు ఐటీ, పర్యాటక సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది.

కాగా, తొలి రోజైన ఆదివారం నాడు ఏపీకి దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొదటి రోజే 32 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆదివారం రాత్రి భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశీ సంస్థలు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నాయని, తొలిరోజే రూ.1.95 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదరడమే అందుకు నిదర్శనమన్నారు. దీంతో పాటు ఒక్క ఐటీ రంగంలోనే సోమవారం 49 ఒప్పందాలు కుదరబోతున్నాయన్నారు.

విశాఖ

విశాఖ

దేశం నలు మూలల నుంచి 1100 మంది ప్రతినిధులు, 41 దేశాల నుంచి 315 మంది విదేశీ ప్రతినిధులు, ఇతరులతో సహా అందరూ కలిపి 1450 మంది పాల్గొన్నారన్నారు.

విశాఖ

విశాఖ

ఆదివారం జరిగిన 32 ఒప్పందాల ఆచరణలోకి వస్తే మొత్తం 94,748 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.

 విశాఖ

విశాఖ

విద్యుత్తు సరఫరాలో అతి తక్కువ పంపిణీ నష్టాలతో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీలో మరింత నాణ్యమైన కరెంటు పంపిణీ చేయడానికి వీలుగా పలుచర్యలు చేపడుతున్నామని, ఇంధన రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడానికి వీలుగా అమరావతిలో ప్రత్యేకించి ఇంధన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

 విశాఖ

విశాఖ

భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ సౌర విద్యుత్‌ కేంద్రంగా మారబోతోందన్నారు. వ్యర్థాల నుంచి కూడా విద్యుత్తు ఉత్పత్తి చేసి ఏపీ ఒక మార్గదర్శిగా నిలవబోతోందన్నారు.

 విశాఖ

విశాఖ

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ నగరంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు.

 విశాఖ

విశాఖ

రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లను కూడా ఎనర్జీ పంప్‌ సెట్లుగా మార్చడం ద్వారా రూ.1200 కోట్ల విలువైన విద్యుత్తు ఆదా అవుతుందన్నారు.

విశాఖ

విశాఖ

రాష్ట్రంలో టెలికం టవర్స్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రయివేటు టెలీకాం సంస్థలకు అవసరమైన బ్యాండ్‌ విడ్త్‌లను అందించేందుకు ప్రత్యేకంగా ‘పవర్‌ టవర్స్‌ కార్పొరేషన్‌' సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు.

విశాఖ

విశాఖ


ఇండో-చైనా భాగస్వామ్య సంబంధాల్లో ఏపీ కీలకం కానుందని చైనాలోని గుజోయ్‌ ప్రభుత్వ వైస్‌ గవర్నర్‌ చెన్‌ మింగ్‌ మింగ్‌ తెలిపారు.

 విశాఖ

విశాఖ

ఇప్పటికే తాము ఏపీతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నామని, ఇరు ప్రాంతాల మధ్య జనాభా, భౌగోళికంగా సారూప్యం ఉందని చెన్ మింగ్ తెలిపారు. ఏపీలో ధీరోదాత్తమైన నాయకత్వం ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

ఇవీ పెట్టుబడులు..!

ఇవీ పెట్టుబడులు..!

ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్‌ కోల్‌ కార్పొరేషన్‌ (క్యూసీసీ) ఆదివారం సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.31,680 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. కృష్ణా జిల్లాలో 5280 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు కోసం క్యూసీసీ సీఈవో గౌతం శర్మ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇవీ పెట్టుబడులు..!

ఇవీ పెట్టుబడులు..!

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తమ్మాడ గ్రామంలో రూ.125 కోట్ల వ్యయంతో కొబ్బరి శుద్ధి పరిశ్రమను నిర్మించబోతోందని విజయనగర్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిస్యూటికల్స్‌ ప్రయివేట్ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 ఇవీ పెట్టుబడులు..!

ఇవీ పెట్టుబడులు..!

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కడి అవకాశాలను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నామని భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ సీఎండీ బాబా కల్యాణి తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆటోమేటివ్‌ పార్కులో పూర్తిస్థాయి బాడీ నిర్వహణ కేంద్రం వస్తుందన్నారు.

 ఇవీ పెట్టుబడులు..!

ఇవీ పెట్టుబడులు..!

దాదాపు రూ.1200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటుతో మూడు వేల మందికి ప్రత్యక్ష, మరో మూడు వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. అనంతపురంలో రక్షణ, ఏరోస్పేస్‌ తయారీ హబ్‌ను నెలకొల్పుతామన్నారు. ఇంకా పలు సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

 ఇవీ పెట్టుబడులు..!

ఇవీ పెట్టుబడులు..!

అనిల్ అంబానీ.. అడాగ్ కంపెనీ కూడా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖలో రూ.5వేల కోట్లతో నౌకా నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇందుకోసం అడాగ్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

English summary
Investments pour into AP, ADAG to set up world class naval facility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X