TTD: శ్రీవారి ఆలయానికి IPL టీం ఓనర్ రూ 10 కోట్ల విరాళంతో ..!!
Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులు ముక్కులు చెల్లించుకోవటం పరిపాటి. గోవిందుడికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. శ్రీవారికి భక్తులు నగదు రూపంలో, బంగారం రూపంలో విరాళాలు సమర్పి స్తుంటారు. ఇలా చెల్లించే వారిలో సామాన్యుల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు ఉంటారు. ఇక, తాజా గా టీటీడీకీ ఒక ఎన్నారై ఇచ్చిన విరాళం పైన చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు IPL టీం LSG ఓనర్ గోయెంకా ఏకంగా రూ 10 కోట్ల విలువైన ఆభరణాలను శ్రీవారి కోసం టీటీడీకి అందిం చారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయాంక ఈ విరాళాన్ని అందజేశారు.
శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో టీటీడీకి విరాళాలు ఇస్తూ ఉంటారు. నిన్న (గురువారం) ఓ ఎన్‌ఆర్‌ఐ కూడా వెంకన్నకు భారీ విరాళం సమర్పించారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆనంద్ మోహన్ భాగవతుల టీటీడీ ట్రస్టులకు కోటి 40 లక్షల రూపాలయను విరాళంగా ఇచ్చారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, ఎస్వీ విద్యా దాన ట్రస్ట్, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌లకు ఈ మొత్తాన్ని ఎన్‌ఆర్‌ఐ విరాళంగా సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి విరాళాల చెక్కులను దాత అందజేశారు.

#WATCH | Andhra Pradesh: RP-Sanjiv Goenka Group chairman and owner of Lucknow Super Giants IPL team, Sanjiv Goenka and his family visit Tirupati Tirumala temple and offer prayers.
— ANI (@ANI) May 16, 2025
(Video: Tirumala Tirupati Devasthanams - TTD) pic.twitter.com/rHY85mURuL
ఇక.. ఈ రోజు IPL LSG టీం ఓనర్ సంజీవ గోయెంకా టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. వీటి విలువ దాదాపు రూ 7 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. శ్రీవారి కోసం గోయెంకా శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాల ఆభరణాలను సమర్పించారు. ఆలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయాంక ఈ విరాళాన్ని అందజేశారు. శ్రీవారిని కుటుంబ సభ్యులతో గోయెంకా దర్శించుకున్నారు. దైవ భక్తి ఎక్కువగా ఉన్న సంజీవ్ గోయెంకా ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలోనూ తనకు దైవం పైన విశ్వాసాన్ని పలు సందర్భాల్లో ప్రదర్శించారు. టీటీడీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన గోయెంకాకు టీటీడీ అభినందించింది.












Click it and Unblock the Notifications