పవన్ పై ఇప్పటం గ్రామస్తుల ఫైర్- ఆ రూ.50 లక్షలు తీసుకుని రా..!
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలోకి వచ్చే ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న రోడ్డు విస్తరణ కోసమంటూ అధికారులు ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంతో మొదలైన ఉద్రిక్తతలు ఇవాళ పవన్ కళ్యాణ్ టూర్ తో మరింత పెరిగాయి. హైకోర్టు తీర్పుతో కూల్చివేతలకు బ్రేక్ పడినా పవన్ టూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్ధానికుల్లో కొందరు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో జనసేన బోగస్ రాజకీయాలు చేస్తోందని స్ధానికులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ముందు ప్రకటించిన 50 లక్షలు తీసుకుని రా అని సూచించారు. అంతేకాని ఇలా గ్రామంలో రాజకీయం చేయడానికి రావద్దు అంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో స్ధానికులు మీడియాతో మాట్లాడారు. ఇందులో పలువురు ఇప్పటంలో పవన్ రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటంలో సభ పెట్టుకున్నప్పుడు గ్రామానికి రూ.50 లక్షలు సాయం ప్రకటించారు. ఈ డబ్బు ఇంకా గ్రామానికి ఇవ్వలేదు.దీంతో ఇప్పటం గ్రామానికి ఇచ్చిన రూ.50 లక్షలు తీసుకుని పవన్ గ్రామానికి రావాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ డబ్బులు తమకు జమ చేయాలని సీఆర్డీయే కోరిందని, కానీ తాము ఇవ్వలేదని జనసేన నేతలు చెప్తున్నారు. దీంతో ఈ డబ్బుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
మంగళగిరి ఇప్పటంలో జనసేన బోగస్ రాజకీయాలు - పవన్ కళ్యాణ్ ముందు ప్రకటించిన 50 లక్షలు తీసుకుని రా , అంతేకాని ఇలా గ్రామంలో రాజకీయం చేయడానికి రావద్దు అంటున్న ఇప్పటం గ్రామస్తులు..!! pic.twitter.com/xB0rqCXLE9
— oneindiatelugu (@oneindiatelugu) November 5, 2022












Click it and Unblock the Notifications