ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ''కొత్త డ్యూటీ''
''.. ఒక రాజు కింద పనిచేయడంకంటే అడవికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం ఉత్తమం '' అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి డ్యూటీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత ఆయన చీఫ్ సెక్రటరీని కలిశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు కలిసినా అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై, అధికారులపై మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది.

కమిషనర్‌గా చేరిన 15 రోజులకే ప్రభుత్వం మళ్లీ సస్పెన్షన్ విధించింది. మరో రెండు సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉన్న ఏబీవీ రెండురోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ".. ఒక రాజు కింద పని చేయడం కంటే అడవికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం మంచిదని" ఓ కవి చెప్పారంటూ ఆయన ఒక వాక్యాన్ని ఉటంకించారు. తనను ఇబ్బంది పెట్టిన ''కులపు మొక్కలను '' పీకుతానని శపథం చేసిన ఏబీవీ అప్పటివరకు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటానన్నారు. చెప్పినట్లుగానే పంచె కట్టి పొలంలోకి దిగారు. పామాయిల్ తోట ఉన్న పొలంలో అంతర పంటగా మరో పంట వేయడానికి భూమిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications