అదే బాసిజం- పీఎస్సార్ సమాధానాలతో విస్తుపోయిన సీఐడీ..!!
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు సీఐడీ విచారణలో ఉన్నారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు విజయవాడ కార్యాలయంలో విచారణ చేసారు. కాగా, ఆ సమయంలో పీఎస్సార్ కీలక వ్యాఖ్యలు చేసారు. అరెస్టు చేయడానికి మీరొస్తారని వారం ముందే తనకు తెలుసంటూ సీఐడీ అధికారులకు చెప్పుకొచ్చారు. అరెస్టు చేస్తే ఒకసారి లోపలకు వెళ్లి వద్దామనుకున్నా. అందుకే ముందస్తు బెయిల్‌కూ వెళ్లలేదంటూ పీఎస్‌ఆర్ ఆంజనేయులు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించారు. జెత్వానీ గురించి పీఎస్సార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అరెస్ట్ గురించి తెలుసు
సీఐడీ అధికారుల విచారణలో పీఎస్సార్ ఆంజనేయులు ఆసక్తి కర సమాధానాలు ఇచ్చారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు విచారించారు. సీఐడీ అధికారులు ఏం అడిగినా ఆయన నింపాదిగా, ఎలాంటి కంగారు లేకుండా తెలియదని చెప్పారు. తనకు సంబం ధం లేదని సమాధానం ఇచ్చారు. జెత్వానీ ఎవరో తనకు తెలియదని..తనకు అప్పట్లో ఈ విషయాలు పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఆమె గురించి ఈ మధ్యే తెలుసుకున్నానని.. తనకు సదాభిప్రాయం లేదని..విద్యాసాగర్‌తో సహజీవనం సాగించినట్లు తెలిసిందని పీఎస్‌ఆర్ సీఐడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

ముక్తసరి సమాధానాలు
సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సీతారామాంజనేయులు నుంచి ముక్తసరి సమాధానాలే వచ్చాయి. తనకేం తెలియదని, కేసుతో అసలు సంబంధమే లేదంటూ అమాయకంగా జవాబులిచ్చారు. పీఎస్సార్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రశ్నించారు. ''జెత్వానీ బ్యాడ్ లేడీ. ఆమె అరెస్టు అప్పుడు నేను ఇంటెలిజెన్స్ చీఫ్‌ను. నాకు ఈ కేసుతో ఏం సంబంధం? ఇది లోకల్ పోలీసులకు సంబంధించిన కేసు. నన్ను ఎందుకు అరెస్టు చేశారు.. అంటూ సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నం స్నాక్స్ తీసుకున్నారు. రాత్రికి ఇడ్లీ తిన్నారు. ఈ ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.












Click it and Unblock the Notifications