ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు: సీఐడీకి..

IPS officers transfers in Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించింది.

తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది ఏపీ ప్రభుత్వం. వారికి వేర్వేరు విభాగాలు, శాఖాధిపతులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి.

IPS officers transfers in Andhra Pradesh
  • రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ నియామితులు అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.
  • ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్)గా పని చేస్తోన్న పీ వెంకట రమణ.. అదే విభాగానికి డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు.
  • వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎస్ వీ శ్రీధర్ రావు సీఐడీ పోలీస్ సూపరింటెండెంట్ గా నియమితులు అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఖాళీగా ఉంటోంది.

కొంతకాలంగా కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు.. తమకు కేటాయించిన శాఖలు, విభాగాల పట్ల అసంత్రుప్తితో ఉన్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా సర్వీసుల నుంచే వైదొలిగారు. ఐపీఎస్ సర్వీసులకు రాజీనామా చేశారు. వీఆర్ఎస్ తీసుకున్నారు. తన రాజీనామాకు అసంత్రుప్తి కారణం కాదంటూ ఆయన వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+