Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కోడిగుడ్ల ధరలు పతనం..ఇరాన్- ఇజ్రాయెల్ వార్ తో సంబంధం!

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తెలుగు రాష్ట్రాలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలోని పౌల్ట్రీ పరిశ్రమపైన, అందులోన ఏపీ, తెలంగాణలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి గల్ఫ్ దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ఎగుమతి జరుగుతుంది.

ఏపీలో దేశంలోనే అధికంగా కోడిగుడ్ల ఉత్పత్తి

ప్రస్తుతం యుద్ధం కారణంగా కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమ పైన పెనుభారం పడుతోంది. ఫలితంగా కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా, ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా గా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్ల ఉత్పత్తి దేశంలోని కోడిగుడ్ల ఉత్పత్తిలో గణనీయంగా ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది.

iran israel war effect on eggs egg prices have dropped sharply due to the exports have stalled from ap

గల్ఫ్ దేశాలకు ఏపీ, తెలంగాణా నుండి కోడిగుడ్ల ఉత్పత్తి

దాదాపు భారతదేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలు ఉత్పత్తి చేసే కోడిగుడ్లలో 18 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి జరుగుతుంది. అంటే రోజుకు దాదాపు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు కేంద్రంగా విస్తరించి ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్ కు ఇక్కడి నుండి కోడిగుడ్లను అందిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతి జరుగుతుంది.


గల్ఫ్ దేశాలకు నిలిచిన నౌకలు.. నో ఎగ్స్ ఎక్స్ పోర్ట్

అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణం లో గల్ఫ్ దేశాలకు నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో ఎగుమతి కావలసిన కోడిగుడ్లు ఇక్కడే నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో కోడిగుడ్ల ధర బాగా పడిపోయింది. ఇక ఎగుమతి చేయాల్సిన గుడ్లను నిల్వ చేయడం కూడా వీలుకాని పరిస్థితులలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

కోడిగుడ్ల ధరలు తగ్గుదల.. పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టం

ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కోడిగుడ్ల హోల్సేల్ ధరను 4.25 పైసలు గా నిర్ణయించగా ప్రస్తుతం బయట చిల్లర వర్తకుల వద్ద ఒక్కొక్క కోడి గుడ్డు ధర 5 రూపాయలు పలుకుతుంది. కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడం పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది.

సామాన్యులకు ధరలు తగ్గటం సంతోషం

కోళ్ళ మేతల ధరలు విపరీతంగా పెరిగి, ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగి ఇబ్బంది పడుతున్న పౌల్ట్రీ రైతులు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా సంక్షోభంతో మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఏదిఏమైనా కోడిగుడ్ల ధరలు తగ్గడం పౌల్ట్రీ నిర్వాహకులకు ఆవేదన కలిగిస్తుంటే, సామాన్య ప్రజానీకం మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+