ఏపీకి వరం, అపార ఖనిజ సంపద: ఇరాన్ ఆసక్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, అవకాశం ఇస్తే వాటిని వెలికి తీసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ నుంచి వచ్చిన బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తెలిపింది.
భారతదేశంతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ బృందం అదినేత అలీ అఖ్బర్ నటేగ్ నౌరీ తెలిపారు. పెట్రో కెమికల్స్, ఐటీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా లభించే బాక్సైట్‌కు తమ దేశంలో మంచి డిమాండ్ ఉందని చెప్పారు.

సముద్ర ఇసుక విస్తారంగా లభించడం ఏపీకి వరమని చెప్పారు. విశాఖ - కాకినాడ పెట్రోలియం కారిడార్, పెట్రో కెమికల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ ప్రాజెక్టులలో తాము భాగస్వాములం అవుతామని చెప్పారు. దీని పైన చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించారు.
ఇరాన్ నుండి ఒక బృందాన్ని పంపించాలని చంద్రబాబు వారికి సూచించారు. వారు వచ్చి అధ్యయనం చేసిన పక్షంలో భాగస్వామ్య ప్రాజెక్టుల పైన ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పారు. అలీ సచివాలయంలో చంద్రబాబును కలిశారు.












Click it and Unblock the Notifications