అయోధ్య, వారణాసి..నైమిశారణ్య సహా - IRCTC యాత్ర ప్యాకేజీ, షెడ్యూల్...!!
ఉత్తరాదిన ప్రముఖ పుణ్య క్షేత్రాల దర్శనం కోసం ఐఆర్సీటీసీ కొత్ ప్యాకేజీ అందుబాటులోకి తీసు కుచ్చింది. వారణాసి.. అయోధ్య తో సహా గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో 8 రాత్రులు అదే విధంగా 9 రోజులు ఈ యాత్ర సాగనుంది. వారణాసి - అయోధ్య - నైమిశారణ్య (లక్నో) -ప్రయాగ్‌రాజ్- శృంగవర్‌పూర్ సందర్శనను కవర్ చేస్తుంది. దర్శించే స్థలాలతో పాటుగా ప్యాకేజీ ధరలను ఐఆర్సీటీసీ ప్రకటించింది.
ఈ గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ పెద్దలకు రూ. 16,200 నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీని భరత్ గౌరవ్ టూరిస్ట్స్ రైలు ద్వారా 2AC, 3AC, SL తరగతుల్లో అందు బాటులో ఉంది. ప్రధానంగా వారణాసి - అయోధ్య - నైమిశారణ్య (లక్నో) - ప్రయాగ్‌రాజ్ - శృంగవర్ పూర్ సందర్శించుకోవచ్చు. మొత్తం 9 రోజుల పర్యటనలో శ్రీరామ జన్మస్థలం (అయో ధ్య, శృంగవర్‌పూర్) తో సంబంధం ఉన్న రెండు ముఖ్యమైన ప్రదేశాలతో సహా నాలుగు ముఖ్యమై న తీర్థయాత్ర స్థలాలను సందర్శించేలా రూట్ ఖరారు చేసారు. జూన్ 14 న మొదలయ్యే ఈ యాత్ర వారణాసి - అయోధ్య - నైమిశారణ్య (లక్నో) -ప్రయాగ్‌రాజ్- శృంగవర్‌పూర్ మీదుగా సాగుతుంది.

సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస స్టేషన్లను కవర్ చేస్తూ వెళ్తుంది. స్లీపర్ కోచ్ (SL) : పెద్దలకు రూ.16,200, పిల్లలు (5-11 సంవత్సరాలు) రూ. 15,200/- తో పాటుగా ఏసీ కోచ్ ల ధరలను ఖరారు చేసారు.వారణాసి : కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం దర్శించుకోవడంతోపాటు సాయంత్రం గంగా హారతి వీక్షించవచ్చు. అయోధ్య : రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి దర్శనం ఉంటుంది. నైమిశారణ్య : చక్ర తీర్థం, హనుమాన్ గర్హి దేవాలయం, వ్యాస ఘడీ సందర్శన ఉండనుంది. ప్రయాగ్ రాజ్ : త్రివేణి సంగం, శృంగవర్పూర్ దర్శన స్థలాలను సందర్శించుకోవచ్చు.












Click it and Unblock the Notifications