irctc 7 జ్యోతిర్లింగాల యాత్ర

ఒకే యాత్రలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించే అవకాశాన్ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కల్పిస్తోంది. కార్తీక మాసం సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టారు. యాత్రలో జ్యోతిర్లింగాలతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా చూడొచ్చు.

నవంబరు 18వ తేదీన విజయవాడ నుంచి యాత్ర ప్రారంభం కాబోతోంది. ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. 12 రాత్రుళ్లు, 13 పగళ్లు యాత్ర ఉంటుంది. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ తరగతుల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సెకండ్ ఏసీకి టికెట్లు అయిపోయాయి. థర్డ్ ఏసీ, స్లీపర్ మిగిలాయి. వీటి ధరలు రూ.21వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

irctc saptha jyotirlinga yatra details here

18వ తేదీ రాత్రి విజయవాడ నుంచి రైలు బయలుదేరి 20వ తేదీ(మూడోరోజు) ఉదయం 5.35 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అక్కడ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని, ఓంకారేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఐదోరోజు ఉదయం వడోదర చేరుకొని స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూస్తారు. ద్వారకలో ద్వారకాదీశ్ ఆలయాన్ని, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని, సోమనాథ్ లో సోమ్ నాథ్ జ్యోతిర్లింగాన్ని, తొమ్మిదోరోజు నాసిక్ లోని త్రయంబకేశ్వర ఆలయాన్ని, 11వ రోజు భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని, 12వ రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని తిరుగు పయనమవుతారు.

ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను ఐఆర్ సీటీసీ సమకూరుస్తుంది. ఎకానమీలో స్లీపర్ క్లాస్ రూ.21వేలు, 5-11 ఏళ్ల చిన్నారులకు రూ.19,500, స్టాండర్డ్ థర్డ్ ఏసీలో రూ.32,500, చిన్నారులకు రూ.31,000, కంఫర్ట్ లో సెకండ్ ఏసీ ప్రయాణానికి రూ.42,500, చిన్నారులకు రూ.40,500 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+