Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ బడ్జెట్ లో ఉద్యోగులకు దక్కిందేంటి..!!

AP Budget 2025-26: ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. రూ 3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటి అమలు దిశగా నిధులు కేటాయించింది. ఇక, గత ప్రభుత్వంలో ఆర్దిక లోపాలు.. వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్దిక మంత్రి పయ్యావుల తన ప్రసంగంలో వివరించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేసారు. ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో చూసారు. మరి.. ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు దక్కిందేంటి...

బడ్జెట్ ప్రసంగంలో
ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్దిక నిర్వహణ లో జరిగిన లోపాలను ప్రస్తావించారు. 1995 లో నాడు చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని గుర్తు చేసారు. ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారం లోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభ లో వివరించారు. ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశ పెట్టటం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు. కాగా, తొలి సారి మూడు లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించారు.

Is any benefits for Employees and Pensioners in AP Budget 2025-26

ఉద్యోగుల ఆశలపై
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొమ్మిది నెలలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుండటంతో తమకు సంబంధించిన అంశాల పైన స్పష్టత వస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు ఆశించారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా.. పెండింగ్ బకాయిలు.. అదే విధంగా రావాల్సిన డీఏల పైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతో ఉద్యోగులు కనిపించారు. జగన్ 2024 ఎన్నికల ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పీఆర్సీ కమిష నర్ రాజీనామా చేసారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు. ఇక.. ఈ బడ్జెట్ లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు నిరీక్షించినా ఫలితం కనిపించలేదు.

Take a Poll

ప్రస్తావన లేకుండానే
బడ్జెట్ లో ఆర్దిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగా ఆర్దిక వ్యవస్థను సరి దిద్దుతున్నామనే అంశం వివరించటానికే ప్రాధాన్యత ఇచ్చారు. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు. నిరుద్యోగ భృతిపై స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారని భావించినా.. ఆ ఊసే లేదు. స్వర్ణాంధ్ర -2047 లక్ష్యాలను వివరించారు. ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకం గా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఉద్యోగులు ప్రభుత్వంతో తాము చర్చలు చేస్తామని.. తమకు రావాల్సిన అంశాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యో గాల నోటిఫికేషన్లు - భర్తీ గురించి ప్రస్తావన లేదు. దీంతో, బడ్జెట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+