బాబుపై అలక: పవన్ ఇంటికెళ్లలేదని ఫైర్, అందుకే రావట్లేదా?, ఎవరూ వెళ్లొద్దని బైరెడ్డి

అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ఆహ్వానించ లేదని జనసేన భగ్గుమంది.

పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఎన్నకలకు ముందు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన చంద్రబాబు... ఇప్పుడు కావాలనే దూరం పెడుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం వాడుకొని ఇప్పుడు మరిచారా అని నిలదీశారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎందుకు విస్మరించారో చెప్పాలని బ్యానర్లు ప్రదర్శించారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Is Chandrababu ignoring Pawan Kalyan?: Jana Sena dharna

అధికారంలోకి వచ్చాక.. పవన్ పవన్ కళ్యాణ్ కూడా తమ గెలుపుకు కారణమని పలువురు టిడిపి నేతలు ఆయనను ప్రశంసించారు. చంద్రబాబు కూడా ఆయనను పొగిడారు. అయితే అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్వయంగా పిలవకపోవడంపై పవన్ అభిమానులు, జనసేన మండిపడుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారు. ఆయన అమరావతి రాజధాని వేడుకకు హాజరు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తనకు షూటింగ్ ఉన్నందున హాజరు కావడం లేదని, తనకు వెళ్లాలని ఉన్నప్పటికీ అది కుదరడం లేదని పవన్ మూడు రోజుల క్రితం చెప్పారు.

ఆయన నివాసానికి మంత్రులు వెళ్లి ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఇప్పుడు జనసేన చంద్రబాబు వెళ్లకపోవడంపై మండిపడుతోంది. ఈ నేపథ్యంలో... ఏపీ సీఎం చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ అలకవహించారా? అనే చర్చ కూడా సాగుతోంది.

బంధువులు, స్నేహితుల కోసమే: బైరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు పైన రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నిప్పులు చెరిగారు. తన బంధువులు, స్నేహితులు బాగుపడటం కోసమే అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టారన్నారు.

తెలుగుదేశం పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాయలసీమ మీద ప్రేమ ఉన్న వారెవరూ అమరావతి శంకుస్థాపనకు వెళ్లరని చెప్పారు.

ప్రధాని అఫాయింటుమెంట్ ఇస్తారనుకుంటున్నా: వైవి సుబ్బారెడ్డి

ప్రధాని తమకు అపాయింట్ మెంట్ ఇస్తారని భావిస్తున్నానని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రధాని అపాయింటుమెంట్ ఇంకా రాలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+