ఢిల్లీ టూర్ ఏ వార్తను మోసుకొస్తుందో : చంద్రబాబు ప్రయత్నాలు సఫలమయ్యేనా
విదేశీ యాత్రలు ముగించుకుని రాష్ట్రంలో ల్యాండయిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ భేటీ ద్వారానైనా ప్రత్యేక హోదాపై కేంద్రం మనసు మార్చాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చంద్రబాబు. ఇందుకోసం ఆయన ప్రధాని మోడీకి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.
కాగా.. చంద్రబాబుకు ప్రస్తుతం మోడీ వద్ద లభించిన అపాయింట్ మెంట్ రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై సమీక్షించడానికి మాత్రమే. దీంతో చంద్రబాబు స్పెషల్ స్టేటస్ ప్రజెంటేషన్ కి మోడీ అదనపు సమయం కేటాయించగలరా అన్నది అనుమానంగా మారింది. మరోవైపు చంద్రబాబు మాత్రం విషయాన్ని ఎలాగైనా మోడీ దగ్గర ప్రస్తావించాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సమయం కేటాయించినా.. ప్రత్యేక హోదాపై పాత పాటే పాడుతారా, లేకపోతే ఆర్థిక కేటాయింపుల విషయంలో రాష్ట్రానికి ఏమైనా ప్రాధాన్యం ఇస్తారా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. చూడాలి మరి చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏపీకి ఎలాంటి వార్తలను మోసుకొస్తుందో..!
ఇదిలా ఉంటే, కరువు పరిస్థితులను నివారించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్న తరుణంలో కరువు నివారణ చర్యల కింద కేంద్రం నుంచి చంద్రబాబు ఎంత సహాయాన్ని తీసుకొస్తారనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications