జగన్ పార్టీ విలీనం కోసం కాంగ్రెస్ ప్రయత్నం, ఎప్పుడు?

 Is Congress seeing at YS Jagan?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందా? అందుకోసం ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ పార్టీకి లోకసభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 44 సీట్లతో సరిపెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీలీనం చేసుకొని లోకసభలో కొంత బలం పెంచుకోవాలని ఉబలాటపడుతోందని ప్రచారం సాగుతోంది. జగన్ కాంగ్రెసు పార్టీను వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన కొత్త పార్టీ పెట్టినప్పటికీ.. కాంగ్రెసు పార్టీతో సంబంధాలు ఉన్నాయని టిడిపి ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ ఇటీవల మోడీని కలిశారు. జగన్ తన కేసుల అంశాన్ని ప్రస్తావించారని అయితే, మోడీ నుండి ఎలాంటి హామీ రాలేదని ఊహాగనాలు వినిపించాయి. అంతేకాదు ఎన్డీయేకు అంశాలవారీగా మద్దతిస్తామని జగన్ ప్రకటించగానే.. బిజెపి స్పందించింది. తమకు ఎవరి అవసరంలేదని, ఎపిలో బాబు ఉన్నారని కౌంటర్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో జగన్ యూపిఏ వైపు మొగ్గు చూపవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేసులు ఉన్నందున అధికార పక్షం అండలేకపోతే.. ప్రతిపక్షం పంచన చేరడం ఉత్తమంగా జగన్ భావించవచ్చునని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకొని బలం పెంచుకోవాలని కాంగ్రెసు పార్టీ చూస్తోందనే ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి జగన్‌ను కాంగ్రెస్ పార్టీ సంప్రదించిందట. అయితే ఆయన మాత్రం అభిప్రాయం చెప్పలేదట. అయితే, కేసులు ఉన్నందున జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే.. పార్టీని నడపలేని పరిస్థితి ఉంటే జగన్ విలీనం గురించి ఆలోచించవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ జగన్ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని రాష్ట్రానికి చెందిన నేతతో చెప్పారని వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+