బ్రిస్బేన్ పిచ్‌కు ధోని భయపడ్డారా?: మీడియా కథనాలు
న్యూఢిల్లీ: డిసెంబర్ 4వ తేదీ నుండి ఆస్ట్రేలియాలోని బ్రిస్పేన్‌లో జరగనున్న తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోనీ దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. దీని పైన వివిధ రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా మీడియా ధోనీ భయపడ్డాడంటూ కథనాలు రాస్తున్నాయి.
ధోనీ కావాలనే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సోమవారం ఆస్ట్రేలియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. బౌన్సీ పిచ్‌గా పేరుగాంచిన బ్రిస్బేన్ మైదానంలో బ్యాటింగ్‌కు భయపడే ధోనీ రెస్ట్ తీసుకున్నాడని పేర్కొంటున్నాయి. ధోనీకి అసలు గాయమెప్పుడైందని, కేవలం బ్రిస్బేన్ మ్యాచ్ నుంచి తప్పించుకునేందుకే అతడు గాయం పేరు చెబుతున్నాడంటున్నాయి.

అయితే వీటి పైన ధోనీ కాని, బీసీసీఐ కాని ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, తన హెలికాఫ్టర్ షాట్లతో బౌలర్లకు చాలాసార్లు చుక్కలు చూపించిన ధోనీకి బ్రిస్పేన్ పిచ్ అంటే అంతగా భయమేమీ లేదని, అయినా ఆస్ట్రేలియా నుంచి ప్రపంచ కప్‌ను లాగేసుకున్న ధోనీ భయపడటమేంటని అభిమానులు అంటున్నారు.
కాగా మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. బొటన వేలికి గాయంతో అతడు శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ మధ్యలో జట్టుతో కలుస్తాడు. అప్పటికి బ్రిస్బేన్ టెస్ట్ ముగుస్తుంది.
కాగా, టెస్టు మ్యాచ్‌లకు సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన మైదానాల్లో బ్రిస్బేన్ పిచ్ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఆ పిచ్ పైన ఆడేందుకు అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల జట్ల సభ్యులు కూడా ఉవ్విళ్లూరుతారు. ఇక్కడ ఆస్ట్రేలియా 26 ఏళ్ల క్రితం వెస్టిండీస్ చేతిలో టెస్ట్ మ్యాచ్ ఓడింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఓడలేదు.












Click it and Unblock the Notifications