చంద్రబాబుకు షాక్: పవన్ కళ్యాణ్-జగన్‌లను కలిపేందుకు రంగంలోకి కేసీఆర్!?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌లను ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.
బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, జగన్, పవన్ కళ్యాణ్‌లు పదేపదే చంద్రబాబును టార్గెట్ చేయడం, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

జగన్-పవన్ కళ్యాణ్‌లను కలిపేందుకు రంగంలోకి కేసీఆర్
టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మనం కూటమి కట్టడాన్ని కూడా కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఓ సీనియర్ మంత్రి ఈ భేటీలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా జగన్, పవన్ కళ్యాణ్‌లను కలిపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణలో ప్రచారం జరుగుతోందని కూడా సదరు మంత్రి వ్యాఖ్యానించారు.

టీడీపీకి వ్యతిరేకంగా అందరూ ఒక్కటయ్యారు
ఏపీ, తెలంగాణలలో బీజేపీతో పాటు వైయస్ జగన్, పవన్ కళ్యాణ్, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మనం అన్ని రకాల కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలను ఎదుర్కోవాలని ఆయన నేతలతో సూచించారు.

సీఎం, మంత్రులే లక్ష్యంగా
ఓటుకు నోటు కేసుపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేయాలని తెలంగాణ ఏసీబీని కేంద్రాన్ని కోరిందని ఓ మంత్రి అన్నారని సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీ విషయంలోనూ ఇదే తరహా దాడులు జరిగే అవకాశముందని కూడా ఓ మంత్రి వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం, మంత్రులే లక్ష్యంగా కేంద్రం కుట్రలు చేస్తోందని మరో నేత చెప్పారట.

చంద్రబాబు ప్రధాని అవుతారనే కామెంట్లు వద్దు
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చంద్రబాబు దృష్టి సారించాలని పలువురు నేతలు అన్నారు. చంద్రబాబు ప్రధానమంత్రి అవుతారని పలువురు నేతలు వ్యాఖ్యానించగా, అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారని తెలుస్తోంది.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు












Click it and Unblock the Notifications