మాచర్ల వీడియో లీక్ ..నారా లోకేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..?
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేశారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సీరియస్ అయింది. పిన్నెల్లిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే పిన్నెల్లి దీనిపై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ వీడియోను తాము రిలీజ్ చేయలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అసలు ఈ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు.

అయితే ఈ వీడియో లీక్ వెనుక టీడీపీ నేత నారా లోకేష్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తోన్న వీడియోను మొదటగా నారా లోకేష్ తన అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో ఈ వీడియో లీక్ వెనుక లోకేష్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఎన్నికల కమీషన్ విచారణ జరుపుతోందని సమాచారం. మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాలో, కోడూరులో 2 ఈవీఎంలు ధ్వంసం అయినట్టు ప్రకటించారు. అయితే మిగిలిన 9 ఈవీఎంలను పగలకొట్టిన వీడియోలు బయటికి రాలేదు కానీ పాల్వాయి గేటు వీడియోలోని కొంత భాగం వరకే టీడీపీ వారికి చేరడం వెనుక పెద్ద కుట్రనే ఉందని అధికారులు భావిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా తొందరపడి ఆ వీడియోని విడుదల చేశారని చివరికి ఇది లోకేష్ మెడకే చుట్టుకోబోతుందనే వాదన బలంగా వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications