వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిని తిట్టడం వెనుక టిడిపి నేత సోమిరెడ్డి: వైసిపికి ఎదురు తిరిగింది!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరిగాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సోమిరెడ్డి చెబితేనే మంత్రి నారాయణను మా ఎమ్మెల్యేలు తిడుతున్నారని కాకాణి వ్యాఖ్యానించారు.

కాకాని వ్యాఖ్యల పైన వైసిపి ఎమ్మెల్యేలే భగ్గుమంటున్నారని చెబుతున్నారు.సోమిరెడ్డి చెబితే తాము మంత్రిని ఎందుకు తిడతామని, తమనియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగడం లేదనే ఆవేదనతో మాట్లాడామే తప్ప ఎవరో చెబితే మంత్రిని విమర్శించడం లేదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రివర్స్‌ అయ్యారని అంటున్నారు.

తాము సోమిరెడ్డితో ఎప్పుడు మాట్లాడలేదని, కావాలంటే తమ ఫోన్ కాల్‌డేటాలు కాకాని గోవర్ధన్ రెడ్డి చూసుకోవచ్చునని కూడా వాపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాకాని వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయంగా మారాయి.

 somireddy chandramohan reddy

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగా కాకాని చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయని చెబుతున్నారు.

ఇటీవల నాలుగైదు రోజుల క్రితం నెల్లూరు, పొదలకూరుల్లో జరిగిన విలేకరుల సమావేశాలలో కాకాని మాట్లాడారు. సోమిరెడ్డి తరచూ తమ పార్టీ వాళ్లతో మాట్లాడుతూ మంత్రి నారాయణను తిట్టమని ప్రోత్సహిస్తున్నారని, ఆయన ఫోన్‌ కాల్‌డేటా బయట పెడితే ఈ విషయం తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై సోమిరెడ్డి, మంత్రి నారాయణ మధ్య విభేదాల సంగతేమిటో కానీ వైసిపిలోనే చిచ్చు రాజుకుందని చెబుతున్నారు. సోమిరెడ్డి తిట్టమంటే తాము తిట్టామని కాకాని చెప్పడం ఏమిటని, ఆయన వ్యాఖ్యలు తమను ఇరుకున పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. సోమిరెడ్డి చెప్తే మేం తిడుతున్నామని చెప్పడంపై కాకాని పైన రుసరుసలాడుతున్నారట.

సిటీ ఎమ్మెల్యే అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిత్యం మంత్రిని టార్గెట్ చేసుకుంటున్నారు. సోమిరెడ్డి చెప్పడం వల్లనే వారిద్దరు నారాయణను టార్గెట్ చేసుకుంటున్నారని కాకాని అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఇదే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పించింది. తాము ఎవరో చెబితే విమర్శించమని అనిల్, కోటంరెడ్డిలు చెబుతున్నారట.

English summary
Is TDP MLC somireddy behind YSRCP MLA allegations on Minister Narayana?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X