టి ఎపి రాష్ట్రంలో లేదా?: ఆగ్రహించిన జగన్‌పార్టీ కొణతాల

కేంద్ర హోంశాఖ విభజన విషయంలో 11 అంశాలపై అడిగిందని, వాటిని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రుల బృందాన్ని(జివోఎం)ను బహిష్కరించినట్లు తాము గతంలోనే చెప్పామన్నారు. సమైక్య వైఖరికి దానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. కేంద్ర హోంశాఖ పంపిన లేఖ తమకు అందిందని చెప్పారు.
తీర్మానం వస్తే ఉద్యమం ఉధృతం: అశోక్ బాబు
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వేరుగా హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులు తమ ఆందోళనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు.
తమ ఉద్యమం ఆగలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన అన్న విషయాన్ని జాతీయ పార్టీలు సైతం గుర్తించాయని చెప్పారు. ఆర్టికల్ 371 డిని రద్దు చేయడమో లేదా సవరించడమో చేయకపోతే విభజన అసాధ్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications