బాబుకు దూరం: నారా లోకేష్‌కు మంత్రి పదవిపై వెంకయ్య వ్యాఖ్యలు
విజయవాడ: తెలుగుదేశం, బిజెపిలకు మధ్య దూరం మరింత పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనను కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు.
వారసత్వ రాజకీయాలపై వెంకయ్య చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్‌ను ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు. వెంకయ్య నాయుడు కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు. విజయవాడలో జరిగిన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇందిరా గాంధీ వారసత్వ రాజకీయాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే, విజయవాడలో చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్‌కు ఆపాదిస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన కుమారుడు కెటి రామారావుకు ఐటి శాఖను ఇచ్చినట్లు నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఐటి శాఖను అప్పగించాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీలో పెరుగుతోంది.

తాను వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తానని, ప్రజాజీవితంలోకి రావాలనుకునేవారికి వ్యక్తిత్వం, ప్రతిభ ఉండాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఆయన ప్రసంగంలోని సారాంశం అదేనని అంటున్నారు. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్‌కు దైవమిచ్చిన వరంగా ఆయన కొన్నాళ్ల క్రితం ప్రశంసించారు.
బిజెపి పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారసత్వ రాజకీయాలపై వెంకయ్య నాయుడు నారా లోకేష్‌ను ఉద్దేశించి చేసినవని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శ కూడా రాష్ట్ర బిజెపి నాయకుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి, టిడిపిలకు మధ్య దూరం మరింత పెరిగిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications