రోజాతో కష్టం!: జగన్‌కు ప్రశాంత్ కిషోర్ షాకింగ్ రిపోర్ట్? బ్రేకులు వేసేనా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నగరి ఎమ్మెల్యే రోజాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా? పార్టీ అధినేత జగన్ ఆమెను సరిచేయక తప్పదా? అంటే ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవుననే చెప్పారనే ప్రచారం సాగుతోంది. రోజా తీరుతో పార్టీకి ఇబ్బంది అని చెప్పారని తెలుస్తోంది.

చదవండి: నోరు జారొద్దు, నేనొచ్చాక మాట్లాడుతా: కేశినేని నానికి నారా లోకేష్ ఫోన్

పదిహేను రోజుల పాటు న్యూజిలాండులో పర్యటించిన జగన్ ఇటీవలే ఏపీలో అడుగు పెట్టారు. అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను జగన్.. ప్రశాంత్ కిషోర్ భుజాన వేశారు.

రాగానే.. ప్రశాంత్ కిషోర్ నివేదిక

రాగానే.. ప్రశాంత్ కిషోర్ నివేదిక

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఆయా నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఈ సర్వేలో వైసిపికి ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే అంశంపై సర్వే నిర్వహించారు. అలాగే, పార్టీలో పలువురి తీరుపై ఆయన జగన్‌కు నివేదిక ఇచ్చారు.

రోజా దూకుడుతో పార్టీకి నష్టమని...

రోజా దూకుడుతో పార్టీకి నష్టమని...

అలాగే, నగరి ఎమ్మెల్యే రోజా తీరుపై కూడా ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. రోజా తీరు, ఆమె వ్యవహారశైలి వల్ల పార్టీకి నష్టమని చెప్పారని తెలుస్తోంది. అసెంబ్లీ సహా పలుచోట్ల అధికార పార్టీపై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ప్రశాంత్ కిషోర్ కూడా అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

రోజాను అదుపు చేయాలని..

రోజాను అదుపు చేయాలని..

ఇది మీకు (జగన్), వైసిపికి నష్టమని ప్రశాంత్ కిషోర్ చెప్పారని ప్రచారం సాగుతోంది. అధికార పార్టీని పని తీరుతో, వ్యూహాత్మకంగా ఇబ్బంది పెట్టాలి తప్ప మాటలతో ఇష్టం వచ్చినట్లు ఎదురు దాడి చేయడం వల్ల కాదని, రోజాను అదుపు చేయాలని చెప్పారని అంటున్నారు.

జగన్ ఆ సూచనలు పరిగణలోకి తీసుకున్నారని ప్రచారం

జగన్ ఆ సూచనలు పరిగణలోకి తీసుకున్నారని ప్రచారం

పార్టీకి మరింత నష్టం జరగకముందే రోజాకు సూచనలు చేయాలని జగన్‌కు ప్రశాంత్ కిషోర్ సూచించారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచనలను జగన్ పరిగణలోకి తీసుకున్నారని కూడా అంటున్నారు.

ప్రత్యామ్నాయం కోసం జగన్ గాలింపు..

ప్రత్యామ్నాయం కోసం జగన్ గాలింపు..

రోజాకు బదులు పార్టీ తరఫున మాట్లాడగలికే మంచి స్పోక్స్ పర్సన్ కోసం జగన్ పరిశీలన చేస్తున్నారని అంటున్నారు. టిడిపిని వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మకంగా విమమర్శించి, అధికార పార్టీని కార్నర్ చేయగలికే వారి కోసం జగన్ పరిశీలన చేస్తున్నారని సమాచారం. ఈ ప్రచారం నిజమే అయితే, జగన్ ఆమెను నిజంగానే పక్కకు పెడితే.. రోజాకు ఇది పెద్ద మైనస్ అవుతుందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is some change in YS Jagan Mohan Reddy after his return from his family tour to London. The Leader of Opposition of AP is back in action and this time he is quite serious.
Please Wait while comments are loading...