మమ్మల్ని ప్రజలే తరిమేస్తారు!: జగన్, రఘువీరాలపై కేఈ ఫైర్, పోటాపోటీ

KE Krishnamurthy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా చెప్పాలని ప్రశ్నించారు.

తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం మెజార్టీ రైతులు భూసేకరణకు అంగీకరించారని చెప్పారు. తెలంగాణలో ఉన్న రైతు ఆత్మహత్యలు ఏపీలో లేవన్నారు. టీడీపీ ప్రభుత్వం పైన రైతులకు నమ్మకం ఉందన్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిలా పాలిస్తే తమను ప్రజలు తరిమి కొడతారన్నారు.

రుణమాఫీకి షరతులు సరికాదు: రఘువీరా

ప్రభుత్వం రుణమాఫీకి షరతులు పెట్టడం సరికాదని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి అన్నారు. రుణమాఫీపై ఆశ చూపి చంద్రబాబు రైతులను మోసం చేశారని ఆరోపించారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు షరతులు పెట్టడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

ఏపీలో 120మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై శనివారం గవర్నర్‌ను కలిసి ప్రజావ్యతిరేక విధానాలపై నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. విభజన చట్టంలోని హామీల అమలుపై బీజేపీ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. హామీల అమలు కోసం చివరి వరకు పోరాడుతామన్నారు.

వైసీపీ ధర్నా

రుణమాఫీకి షరతులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఏపీలోని కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగింది. అధినేత జగన్ విశాఖ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నాయకుడు మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను నేపథ్యంలో చంద్రబాబు తమ పేరుతో (విశాఖ పేరుతో) డబ్బులు వసూలి చేసి ఏం చేస్తున్నారని, దానికి లెక్క చెప్పాలని నిలదీశారు.

పోటాపోటీ ధర్నాలు

రుణమాఫీపై షరతులు విధించడాన్ని నిరసిస్తూ జగన్ చేపట్టిన మహాధర్నాకు టీడీపీ కౌంటర్ ధర్నాకు దిగింది. జగన్ విశాఖలో మహాధర్నాకు దిగితే, ఆయన తీరును నిరసిస్తూ టీడీపీ విజయవాడలో ధర్నాకు దిగింది. అయితే అధికార పార్టీ తరఫున ధర్నా జరుగుతున్న వైనాన్ని మీడియా ప్రస్తావించిన సందర్భంగా టీడీపీ బెజవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న సరికొత్తగా స్పందించారు.

తాము చేస్తున్నది ధర్నా కాదని, చెడు వినకు, చూడకు, మాట్లాడకు.. అన్న మహాత్ముడి మాటను పాటించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు చెప్పారు. అంతేకాక సదరు నిరసనను వారు గాంధీజీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+