SSLV-D2 ప్రయోగం సక్సెస్-మూడు శాటిలైట్స్ నింగిలోకి పంపిన ఇస్రో...

మూడు ప్రయోగాత్మక శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లే చిన్న తరహా అంతరిక్ష వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ను ఇవాళ ఇస్రో ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించింది.

ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఇవాళ మరో అద్భుతమైన ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. మూడు ప్రయోగాత్మక శాటిలైట్లను మోసుకెళ్లే చిన్న తరహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ2ను నింగిలోకి ప్రయోగించింది. సరిగ్గా ఉదయం 9.18 నిమిషాలకు శ్రీహరికోట నుంచి మూడు శాటిలైట్లను రాకెట్ విజయవంతంగా మోసుకెళ్లింది. మూడు దశల్లో ఇది అంతరిక్షానికి చేరబోతోంది.

మూడు ఉపగ్రహాలు EOS-07, Janus-1, AzaadiSAT-2 ను 450 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం-SSLV-D2-ని ఇస్రో ప్రయోగించింది. అభివృద్ధి చెందుతున్న చిన్న, సూక్ష్మ వాణిజ్య శాటిలైట్ మార్కెట్‌ను అందిపుచ్చుకునే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు. సాధారణంగా ఇస్రో ఓ పీఎస్ఎల్వీ వాహక నౌకను అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే కనీసం 600 మంది శాస్త్రవేత్తలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ చిన్న వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ను ఓ చిన్న బృందం అతి తక్కువ సమయంలోనే రూపొందించింది.

ISRO successfully launches SSLV-D2 with three satellites

ఇవాళ ప్రయోగించిన అంతరిక్ష వాహన నౌక ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి ద్రవ-ఇంధన-ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ను, తర్వాత మూడు ఘన దశలను ఉపయోగిస్తుంది. కోవిడ్ కారణంగా పలుమార్లు ఆలస్యమైనా గత ఆగస్టులో ప్రయోగించిన ఈ నౌక ఉపగ్రహాలను ఖచ్చితమైన కక్ష్యలోకి పంపడంలో విఫలమైంది. రెండవ దశ విభజన సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పలు మార్పులు చేసి మరోసారి ఇవాళ ప్రయోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+