వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టును ఆశ్ర‌యించిన ఐటి గ్రిడ్స్ అశోక్‌: ముంద‌స్తు బెయిల్ కోసం అభ్య‌ర్ధ‌న: ఇంత‌కీ ఎక్క‌డున్నారు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ పౌరుల స‌మాచారం..ఆధార్‌..ఓట‌రు కార్డు..ప్ర‌భుత్వ ప‌ధ‌కాల ల‌బ్దిదారుల స‌మాచారం ఐటీ గ్రిడ్స్ ద్వారా టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధానం చేసారు. దీంతో..కేసు న‌మోదైంది. సిట్ ఏర్పాటు చేసినా..ఇప్ప‌టి వ‌ర‌కు ఆశోక్‌ను ప‌ట్టుకోలేదు. ఇదే స‌మ‌యంలో అశోక్ మందుస్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు,

ఐటీ గ్రిడ్స్ అశోక్ ఎక్క‌డ‌...
ఏపీ-తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన డేటా చోరీ కేసులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఐటీ గ్రిడ్స్ అశోక్ ఇప్ప‌టికీ పోల‌సులకు దొర‌క‌లేదు.డేటా చోరీ వ్య‌వ‌హారం పైన లోకేశ్వ‌ర్ రెడ్డి సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. దీని ఆధారంగా తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచార‌ణ సాగిస్తున్న సిట్ అశోక్ కోసం గాలింపు కొన‌సాగిస్తోంది. అశోక్ ఏపీ రాజ‌ధానిలోనే ఉన్నార‌ని..ఆయ‌న‌కు టీడీపీ ముఖ్యులు ఆశ్ర‌యం ఇస్తున్నార‌ని రాజ‌కీయంగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశం పైన ఏపీ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, రెండు ప్ర‌భుత్వాలు వేసిన సిట్‌లు ఇంత వ‌ర‌కు ఎటువంటి పురోగ‌తి సాధించ‌లేదు. ఈ వ్య‌వ‌హారం పైన వైసీపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని సైతం క‌లిసి ఫిర్యాదు చేసింది. ఇది వివాదం కొన‌సాగుతుండ‌గానే టీడీపీ సేవామ‌త్ర యాప్‌ను తొలిగించారు. ఎన్నిక‌ల వేళ ఇది రాజ‌కీయాంగానూ సంచ‌ల‌నంగా మారింది. అయితే, ఇదే కేసులో విశాఖ‌లోని బ్లూ ఫ్రాగ్ సంస్థ పైనా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

IT Grids Ashok approached court for Anticipatory Bail ..Police searching for him..

ముంద‌స్తు బెయిల్ కోసం..
ఇక వైపు అశోక్ కోసం గాలింపు కొన‌సాగుతుండ‌గానే...ఐటీ గ్రిడ్స్ అశోక్ త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్ర‌యించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ కేసు నుండి బ‌య‌ట ప‌డాల‌నే ఉద్దేశంతో అశోక్ పావులు క‌దుపుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కోర్టు లో పిటీష‌న్ దాఖ‌లు చేసారు. అశోక్‌తో పాటుగా స‌హ నిందులుగా ఉన్న భార్య శ్రీలక్ష్మి అనుచ‌రులు షేక్ అబ్దుల్ ఉజైన్‌, క‌మ‌లాక‌ర్ విడివిడిగా రంగారెడ్డి జిల్లా కోర్టులో ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అయితే, విచార‌ణ స‌మ‌యంలో ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కౌంట‌రు దాఖ‌లు చేసారు. సుదీర్ఘ వాద‌న‌ల త‌రువాత ఉత్త‌ర్వుల కోసం కేసును ఈ నెల 23వ తేదీకి న్యాయ‌మూర్తి వాయిదా వేసారు.

English summary
It Grids Ashok approached Rangareddy dist court for anticipatory Bail in Data theft case. Telangana police searching for hi, on this case since two months. Govt appointed SIT for this case investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X