జూ.ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదు.!ఆయన చెప్తే ఎందుకు వినాలి?వల్లభనేని వంశీ రియాక్షన్

అమరావతి : ఏపీ శాసన సభలో చోటుచేసుకున్న సంఘటనలు, చంద్రబాబు నాయుడు రోధించిన తర్వాత నెలకొన్న పరిణామాలు, తర్వాత బాలకృష్ణ కుటుంబ సబ్యుల విలేఖరుల సమావేశంలో చేసిన హెచ్చరికల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన అంశం పట్ల తాజాగా చర్చ జరుగుతూనే ఉంది. కొడాలి నానికి, వల్లభనేని వంశీ దూకుడుకు జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మిత్రులని, వారిని నియంత్రించే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని అమరావతి వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్టు కొడాలి నానికి, వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ తో ఒకప్పుడున్న సఖ్యత ఇప్పుడుందా అన్నదే సందేహంగా మారింది. వారి మద్య స్నేహ పూర్వక వాతావరణం లేదు అనడానికి వల్లభనేని వంశీ చేసిన వాఖ్యలు దోహదం చేస్తున్నాయి.

It has nothing to do with J.NTR!Vallabhaneni Vamsi reacted on J.Ntr

వల్లభనేని వంశీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కు, తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఆదేశిస్తే తాను ఎందుకు పాటించాలని ఎదురు ప్రశ్నించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది ఎందుకు వినాలని అన్నారు. ఒకప్పుడు కలిసి చిత్ర పరిశ్రమలో పని చూశామని, ఆ సంబంధాలు కొనసాగుతున్నాయా.? తెగిపోయాయా అనే అంశం అప్రస్తుతమని వల్లభనేని వంశీ స్పష్టం చేసారు. జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు రావటంతో పూర్తిగా విడిపోయినప్పటికీ హరికృష్ణ కుమారుడిగా గౌరవిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే నని, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ చెపితే వినాల్సిన అవసరము తమకు లేనే లేదని కొడాలి నానితోపాటు వల్లభనేని వంశీ స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+