మర్యాదపూర్వకంగానే కలిశా: చంద్రబాబుతో భేటీపై కమల్ హాసన్
విజయవాడ: తాను మర్యాదపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశానని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ చెప్పారు. చంద్రబాబుతో ఆయన దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. సమావేశానంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆహ్వానం అందినా అప్పుడు రాలేకపోయానని, అందుకే ఇప్పుడు నేరుగా వచ్చి అభినందనలను తెలిపానని ఆయన అన్నారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు రెండు రాజధానులు ఉండడం శుభపరిణామమని అమరావతి శంకుస్థాపన సందర్భంగా కమల్ హాసన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

గురజాడ కుటుంబ సభ్యుల భేటీ
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కవి గురజాడ అప్పారావు కుటుంబసభ్యులు గురువారం కలిశారు. ఈ ఏడాది జరిగే గురజాడ అప్పారావు శతవర్థంతి ఉత్సవాలకు రావాలని చంద్రబాబును కుటుంబసభ్యులు ఆహ్వానించారు.
దీంతో పాటు విజయనగరంలోని గురజాడ స్మారక చిహ్నం దగ్గర ఇంటి నిర్మాణానికి అనుమతించాలని ఆయన మనవరాలు ఇందిర సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications