చైనాతో పోటీ, తక్కువ ధరకే ఫోన్లు: లోకేష్, ఐటీ కంపెనీలకు 90 రోజుల గడువు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: చైనాలో ప్రత్యేకించి సెల్‌ఫోన్ల తయారీకే షెన్‌జెన్‌ పేరుతో నగరాన్ని సృష్టించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇదే తరహాలో ఏపీలోనూ రెండు క్లస్టర్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

భవిష్యత్తులో చైనాకు పోటీగా, వారికన్నా తక్కువ ధరకు ఫోన్లను అందించేలా ఏపీ ఎదుగుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్‌పై మళ్లీ: పవన్ పేరుందనే ఈ పోస్ట్.. మహేష్ కత్తికి 'సపోర్టర్' చురక

రేణిగుంట విమానాశ్రయం బయట, శ్రీసిటీలో ఇలా రెండు క్లస్టర్లలో ఫోన్ల విడిభాగాల తయారీ నుంచి పనికిరాని ఫోన్లను (ఈ-వేస్ట్‌) తిరిగి వేరేలా వాడేవరకు అన్నీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

భవిష్యత్తులో చైనాకు పోటీగా

భవిష్యత్తులో చైనాకు పోటీగా

దీనిద్వారా తయారీ ఖర్చు బాగా తగ్గుతుందని లోకేష్ వెల్లడించారు. భవిష్యత్తులో చైనాకు పోటీగా, వారికన్నా తక్కువ ధరకు ఫోన్లను అందించేలా ఎదుగుతామన్నారు. దీర్ఘకాలంగా మన్నే సాంకేతికతపై ఆవిష్కర్తలు దృష్టి పెట్టాలన్నారు.

చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు

చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ తయారయ్యే సృజనాత్మక ఉత్పత్తులను ప్రపంచ విపణిలోకి చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని లోకేష్‌ తెలిపారు.

మార్కెట్లోకి చౌక మొబైల్ ఫోన్లు

మార్కెట్లోకి చౌక మొబైల్ ఫోన్లు

భవిష్యత్తులో ఏపీలో తయారయ్యే ఫోన్లే చౌకగా మార్కెట్లోకి వస్తాయని లోకేష్‌ తెలిపారు. విశాఖలో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ సృజన సదస్సులో భాగంగా ఆదివారం నాటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కార్యగోష్టిలో పాల్గొన్న లోకేష్

కార్యగోష్టిలో పాల్గొన్న లోకేష్

భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన యువ ఆవిష్కర్తలతో భేటీ అయ్యారు. ఏషియన్‌ అండ్‌ పసిఫిక్‌ సెంటర్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీసీటీటీ) ఆధ్వర్యంలో 'సృజనాత్మక ఆవిష్కర్తలకు ప్రోత్సాహం, సాంకేతికతలో మార్పులు' అంశంపై నిర్వహించిన కార్యగోష్ఠిలో పాల్గొన్నారు.

ఐటీ కంపెనీలకు 90 రోజుల గడువు

ఐటీ కంపెనీలకు 90 రోజుల గడువు

రుషికొండ ప్రాంతంలో ఐటీ కంపెనీలకు భూములు ఇచ్చామని, మూడు నెలల్లో ఆ కంపెనీలు పనులు ప్రారంభించాలని, 90 రోజుల్లో ప్రారంభం కాకుంటే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT Minister Nara Lokesh has asked the IT firms to set up their base as promised within next three months or else lands allotted to them on the Rushikonda IT hills would be taken back by the state government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి