Nara Lokesh: సత్య నాదెళ్లతో నారా లోకేష్.. ఏపీకి భారీగా పెట్టుబడులు..!

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈఓలు, అధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కలిశారు. ఏపీలో ఉన్న అవకాశాలపై సత్య నాదెళ్లకు లోకేష్ వివరించారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ కు టెక్నికల్ సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర రాజధానికి ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు రావాలని సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.

లోకేష్ చెప్పినవన్నీ నోట్ చేసుకున్న సత్య నాదెళ్ల.. తమ కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో కీలకు పని చేస్తుందని అన్నారు. ఈ రంగల్లో తమ కంపెనీ ప్రపంచ కంపెనీగా ఉందని.. సాఫ్ట్ వేర్ తో పాటు వివిధ రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని వివరించారు. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కంపెనీ 2023లో 211.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లుగా గుర్తు చేశారు.

IT Minister Nara Lokesh in a meeting with Microsoft CEO Satya Nadella

దీని స్పందనగా.. ఏపీను ఐటీ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ హబ్ లు, ఎన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. క్లౌడ్ సేవల్ల మైక్రోసాఫ్ట్ సహకారం చాలా అవసరమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ తో విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు గుర్తు చేశారు.

అంతకు ముందు నారా లోకేష్ టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనంతపురం అనుకూలంగా ఉంటుందని వివరించారు.అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని పేర్కొన్నారు. ఆ తర్వాత డల్లాస్‌లో పెరోట్ గ్రూప్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌ను లోకేష్ కలిశారు. మరికొంత మంది కంపెనీల సీఈఓలను లోకేష్ కలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+