విశాఖ:పేరం గ్రూప్ అధినేత నివాసంపై ఐటి సోదాలు...హరిబాబుపై దాడులు అందుకేనా?
విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శి గ్యాస్ నాని నివాసంలో తనఖీలు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు విశాఖలో తమ సోదాలు చేపట్టారు.
విశాఖలో పేరం గ్రూప్ అధినేత, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ సమీప బంధువు హరిబాబు కు చెందిన నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే తిరుపతి, హైదరాబాద్‌లోని హరిబాబుకు సంబంధించిన ప్రాంతాల్లోనూ ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిసింది.

వీటితో పాటుగా హైదరాబాద్‌లోని మంజీరా మెజిస్టిక్ మాల్‌లోని పేరం గ్రూపు ప్రధాన కార్యాలయంలో కూడా కొద్దిసేపటి క్రితమే ఐటి అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అలాగే పేరం గ్రూప్ అధినేతకు సంబంధించిన జీజీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ సమీపంలోని పేరం రియల్ ఎస్టేట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
పేరం హరిబాబు చేస్తున్న వ్యాపారానికి, ఆయన ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు తీవ్ర వ్యత్యాసం ఉందనే అనుమానంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లుగా సమాచారం. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అనుమానం రావడంతో ఐటీ అధికారులు సోదాలకు దిగారనేది మరికొందరి వాదన. ఈ సోదాల్లో ఐటి అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక పేరం గ్రూపు అధినేత హరిబాబు స్వస్థలం తిరుపతి కాగా ఈయన గుంటూరు జిల్లా గురజాల టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు వియ్యంకుడు కావడం గమనార్హం. అంతేకాకుండా పేరం హరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సన్నిహితుడుగా వైసిపి నేతలు చెబుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications