వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మరో షాక్, బీజేపీకి పొంచి ఉన్న ప్రమాదం: బాబు వెళ్లిపోతే 'పెద్ద' చిక్కే

|
Google Oneindia TeluguNews

అమరావతి: మొన్న శివసేన, నిన్న తెలుగుదేశం, నేడు శిరోమణి అకాలీదళ్.. ఇలా బీజేపీపై వరుసగా మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన నిర్ణయించుకుంది. టీడీపీ ప్రస్తుతం డైలమాలో ఉంది.

Recommended Video

TDP MP Sivaprasad Takes A Dig At Modi & Reveals Chandrababu's Strength

2019 ఎన్నికలకు ముందు ఎన్డీయేకే పెద్ద దెబ్బ: చంద్రబాబు ఎఫెక్ట్, మోడీకి ఎసరు?2019 ఎన్నికలకు ముందు ఎన్డీయేకే పెద్ద దెబ్బ: చంద్రబాబు ఎఫెక్ట్, మోడీకి ఎసరు?

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేస్తే ఓకే లేదంటే నమస్కారం పెడతామని కుండబద్దలు కొట్టారు. దీంతో టీడీపీ తీవ్ర నిర్ణయం తీసుకుంటుందని భావించారు.

నాకు గౌరవం ఇవ్వలేదు, ఉద్ధవ్‌తో మాట్లాడానా: మోడీపై బాబు ఆగ్రహం, ఇంకా ఓపికా.. సుజనకు నిలదీతనాకు గౌరవం ఇవ్వలేదు, ఉద్ధవ్‌తో మాట్లాడానా: మోడీపై బాబు ఆగ్రహం, ఇంకా ఓపికా.. సుజనకు నిలదీత

రాజ్‌నాథ్ హామీతో

రాజ్‌నాథ్ హామీతో

కానీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఢిల్లీ పెద్దల హామీతో చంద్రబాబు ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. అయితే వారికి గడువు విధించారని తెలుస్తోంది. బడ్జెట్ ఆమోదం పొందేలోపు లేదా మరో మూడు నాలుగు నెలల్లో ఏపీకి న్యాయం చేయాలని, బడ్జెట్‌లో చేసిన అన్యాయాన్ని తిరిగి ఫుల్‌ఫిల్ చేయాలని ఖరాఖండిగా చెప్పారని తెలుస్తోంది.

 ఏపీ నేతలు అలా భావిస్తున్నా ఢిల్లీ బీజేపీ పెద్దల డైలమా

ఏపీ నేతలు అలా భావిస్తున్నా ఢిల్లీ బీజేపీ పెద్దల డైలమా

ఏపీకి న్యాయం చేయకుంటే మరో కొన్ని నెలల్లో తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు డిమాండ్ పెట్టారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా దూరం జరిగితే బీజేపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఓ వైపు ఏపీ బీజేపీ నేతలు సొంతగా వెళ్లాలనుకుంటున్నారు. కానీ జాతీయ పరిస్థితుల దృష్ట్యా మిత్ర పక్షాలను దూరం చేసుకోవద్దని బీజేపీ భావిస్తోంది.

 చంద్రబాబు లాంటి నేత బయటకు వెళ్తే గట్టి షాక్

చంద్రబాబు లాంటి నేత బయటకు వెళ్తే గట్టి షాక్

అందుకే, చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపీ డైలమాలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే శివసేన కటీఫ్ చెప్పింది. మరోవైపు వరుసగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా అకాలీదళ్ కూడా ఎదురు తిరుగుతోంది. ఎన్డీయోలో చంద్రబాబు పెద్ద భాగస్వామి. చంద్రబాబు బయటకు వెళ్తే బీజేపీకి గట్టి షాక్ తగులుతుంది.

 చంద్రబాబుకు బీజేపీ అవసరం, బీజేపీకి బాబు అవసరం

చంద్రబాబుకు బీజేపీ అవసరం, బీజేపీకి బాబు అవసరం

గతంలో జాతీయస్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు మళ్లీ తిప్పే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలో ఆయనను దూరం చేసుకోవద్దని బీజేపీ కూడా భావిస్తోంది. విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబుకు కేంద్రం అవసరం ఎంత ఉందో, వరుసగా షాకులు తింటున్న బీజేపీకి టీడీపీ అవసరం అంతే ఉందని అంటున్నారు.

 టీడీపీకి శివసేన, అకాలీదళ్ మద్దతు

టీడీపీకి శివసేన, అకాలీదళ్ మద్దతు

ఎన్డీయేలోని బీజేపీ మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా దూరమవుతున్నాయనడానికి సోమవారం లోకసభలో శివసేనకు తోడు అకాలీదళ్.. టిడిపికి మద్దతు తెలపడమే నిదర్శనం అంటున్నారు. ఎన్డీయేలోని పెద్ద పార్టీలు తప్పుకుంటే ఆ పార్టీకి 2019లో ఊహించని షాకులు తప్పవని అంటున్నారు.

శిరోమణి అకాలీదళ్ నేత చురకలు

శిరోమణి అకాలీదళ్ నేత చురకలు

2019లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన చెప్పింది. ఏపీకి న్యాయం జరగకుంటే టీడీపీ గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శిరోమణి అకాలీదళ్ కూడా ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మిత్రపక్షాలకు కేంద్రం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని ప్రధాని మోడీ చెబుతున్నారని, కానీ మిత్రపక్షాల విషయంలోను అలా వ్యవహరించాలని చురకలు అంటించారు. శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌దేవ్ సింగ్ మాట్లాడుతూ.. నాడు వాజపేయి ప్రభుత్వం మిత్రపక్షాలకు ఎంతో గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు మాత్రం అలా లేదని వాపోయారు. తమ పార్టీ నేతలకు ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదన్నారు.

 బీజేపీకి పొంచివున్న ఆ ప్రమాదం

బీజేపీకి పొంచివున్న ఆ ప్రమాదం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి న్యాయం జరగకుంటే చంద్రబాబు బయటకు వస్తే, ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఢిల్లీ స్థాయిలో చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు అంటోన్న విషయం తెలిసిందే. అదే జరిగితే కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి పుట్టుకు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆ ప్రమాదం వద్దని బీజేపీ కూడా భావిస్తోందని తెలుస్తోంది.

English summary
With the Lok Sabha elections coming up next year, or possibly even earlier, the TDP is the latest to join an increasing number of NDA partners who have started raising their voice against what they claim is the uncaring attitude of the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X