చంద్రబాబుకు జనం ఝలక్... వెలవెలబోయిన నవ నిర్మాణ దీక్ష, ఎండదెబ్బే కారణమా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించిన ‘నవ నిర్మాణ దీక్ష’ కార్యక్రమం జనం లేక వెలవెలబోయింది. ఎండదెబ్బ తట్టుకోలేక ప్రతిజ్ఞ చేయించే సమయానికి చాలామంది వెళ్లిపోయారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించిన 'నవ నిర్మాణ దీక్ష' కార్యక్రమం జనం లేక వెలవెలబోయింది. రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయిన ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఆయన ఆరంభించిన ఏడు రోజుల దీక్ష.. తొలిరోజునే తుస్సు మంది.

ఈ దీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ ఒక చీకటి దినం అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు చెప్పారు.

ప్రత్యేక హోదాలో లభించే అన్నీ ఈ ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా నేతలు, ప్రజలతో నవ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. అయితే చంద్రబాబు నాయుడికి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు.

It's Un-Imagined Shock to Chandrababu Naidu: ‘Nava Nirmana Deeksha' Attar Flap with less number of people

తన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి జనం నుంచి అపూర్వ స్పందన వస్తుందని చంద్రబాబు భావించారు. ఈ మేరకు దీక్షా ప్రాంగణం వద్ద జనం కోసం భారీ సంఖ్యలో కుర్చీలు వేయించారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. దీక్ష మొదలైనా.. ప్రజల నుంచి పెద్దగా స్పందన కానరాలేదు.

ఎండదెబ్బ తట్టుకోలేక ప్రతిజ్ఞ చేయించే సమయానికి వచ్చిన జనంలో చాలామంది మహిళలు వెళ్లిపోయారు. దీనికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం కూడా దాదాపు గంటన్నర సేపు సాగింది. దీంతో అంతసేపు ఎండలో కూర్చోలేక చాలామంది మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. దీంతో ప్రసంగం, ప్రతిజ్ఞ సమయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

It's Un-Imagined Shock to Chandrababu Naidu: ‘Nava Nirmana Deeksha' Attar Flap with less number of people

వైఎస్ఆర్ జిల్లాలోనూ.. అట్టర్ ఫ్లాప్

వైఎస్ఆర్ జిల్లాలోనూ నవ నిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలంతా దీక్షలో పాల్గొనాలంటూ చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా నానా హంగామా చేస్తే.. మొత్తంమీద జిల్లాలోని ప్రజల నుంచి ఆశించిన స్పందన కానరాలేదు. కడపలోని ఏడురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన దీక్షకు డ్వాక్రా, ఉపాధి హామీ మహిళలను బలవంతంగా తరలించారు. వారు తప్ప మరెవరూ పెద్దగా ఈ సభలో పాల్గొనకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+