జగనన్నను వీడినందుకు బాధగానే ఉంది, గిల్టీ ఫిలింగ్ లేదు: భూమా అఖిలప్రియ

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమైనందుకు బాధగానే ఉందని, అయితే పార్టీ మారినందుకు మాత్రం గిల్టీగా ఫీల్ కావడం లేదని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అన్నారు. ఇటీవలటీడీపీలో చేరిన భూమా అఖిల ప్రియ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆ విధంగా అన్నారు.

తప్పని సరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వచ్చిందిన్నారని చెప్పారు ప్రజల కోసమే పార్టీ మారామని అన్నారు. ఎన్నికైన ఏడాదిన్నరలోనే పార్టీ మారడం తప్పు అనిపించలేదా అని ప్రశ్నించగా అఖిల ప్రియ ఆ విధంగా అన్నారు. పార్టీ మారినందుకు గిల్టీగా ఫీల్ అవడం లేదని కాకపోతే ఒక విషయంలో మాత్రం చాలా బాధగా ఉందన్నారు.

It was painful to leave YS Jagan: Akhila Priya

వైసీపీలో ఉన్నప్పుడు రోజూ జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడేదానినని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నానని చెప్పారామె. జగన్ రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించారని తాను అనుకోవడం లేదన్నారు.

వ్యక్తిగతంగా జగన్‌ కుటుంబంతో చాలా అనుబంధం ఉందన్నారు. తనకు, తన నాన్నకు, తన కుటుంబానికి జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారని అఖిల ప్రియ చెప్పారు. జగన్ సీఎం కావాలని అమ్మ తపించిన మాట వాస్తవమేనన్నారు. జగన్ సీఎం అయితే వ్యక్తిగతంగా తాము కూడా ఆనందిస్తామన్నారు. జగన్‌పై తమకు ఒక్కశాతం కూడా కోపం లేదన్నారు.

నాన్న మీద నమ్మకంతోనే జగన్ పీఏసీ పదవి ఇచ్చారని, ఆ పదవిలో ఉన్నసమయంలో తన నాన్న ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేశారని చెప్పారు. జగన్‌కు, ఆయన కుటుంబానికి మంచి జరగాలనే కోరుకుంటున్నామన్నారు. ఆ విషయంలో జగన్‌కు తాను ఆల్‌‌ ది బెస్ట్ చెబుతున్నానన్నారు. రెండు పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిదే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+