పొలిటికల్ పార్టీ ఆఫీసా?: ఏపీ సీఎంఓపై కోర్టుకెక్కిన ఐవైఆర్ కృష్ణారావు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) పనితీరును ఆక్షేపిస్తూ ఐవైఆర్‌ కృష్ణారావు సోమవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు.

  Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu

  అమరావతికి పెనుముప్పు: బాబు సర్కారుపై ఐవైఆర్ కృష్ణారావు సంచలనం

   పొలిటికల్ ఆఫీసా?

  పొలిటికల్ ఆఫీసా?

  ఏపీ సీఎంవో రాజకీయ పార్టీ ఆఫీసుగా మారిందని, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ కార్యాలయం పారదర్శకంగా పనిచేందుకు ఓ విధానాన్ని రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.

  పని చేయడం లేదు..

  పని చేయడం లేదు..

  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సీఎంవో కార్యాలయం రాజకీయ కార్యాలయంగా పనిచేస్తోందని వ్యాజ్యంలో ఆక్షేపించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదన్నారు.

   అధ్వాన్నంగా పనితీరు..

  అధ్వాన్నంగా పనితీరు..

  గత జులై 17న సమాచార హక్కు చట్ట ప్రకారం ఓ దస్త్రానికి సంబంధించి ప్రతిని కోరగా నేటికీ సమాధానం రాలేదని వివరించారు. దీన్నిబట్టి రికార్డులను సక్రమంగా నిర్వహించడంలేదని అర్థమవుతోందన్నారు. గవర్నర్‌, పీఎంవో కార్యాలయాల్లో సైతం రికార్డులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఐవైఆర్ పేర్కొన్నారు.

   కొత్తేమీ కాదు.. వెనుక ఆయనే?

  కొత్తేమీ కాదు.. వెనుక ఆయనే?

  గతంలోనూ ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని ఐవైఆర్ విమర్శలతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి తొలగించిన నాటి నుంచి చంద్రబాబు సర్కారుపై ఐవైఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కాగా, ఐవైఆర్ వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నారని టీడీపీ మంత్రులు, నేతలు ఆరోపిస్తుండటం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that Andhra Pradesh former CS IYR Krishna Rao on Monday filed a pil in high court on AP CMO.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి