భారత్‌లోని బ్లాక్‌మనీ వైట్‌గా మార్చేందుకే 'అమరావతి'!: బాబుపై ఐవైఆర్ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ విధానం సరైంది కాదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుఆదివారం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ విధానం సరైంది కాదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుఆదివారం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.

స్విస్ ఛాలెంజ్‌తో ఏపీకి నష్టం
ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చంద్రబాబుకు లేఖ రాశానని కృష్ణారావు తెలిపారు. స్విస్ ఛాలెంజ్ విధానం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు.
Recommended Video


ఆ వివరాలను లేఖలో తెలిపా
స్విస్ ఛాలెంజ్ విధివిధానాలను వక్రీకరించి తారుమారు చేసి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కృష్ణారావు తెలిపారు. సింగపూర్ కంపెనీల విషయంలో తనకు ఉన్న అభ్యంతరాలను అభ్యంతరాలన్నింటిని సిఎంకు రాసిన లేఖలో వివరించినట్లు చెప్పారు. కొన్ని కంపెనీలను దొడ్డిదారిన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు లేఖలో వివరించానని చెప్పారు.

నల్లధనం తెల్లగా మారేందుకు అమరావతి.. సంచలన ఆరోపణ
జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సింగపూర్ కంపెనీల విషయంలో అన్ని నిబంధనలను సమగ్రంగా పాటించారా అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. భారత్‌లోని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సింగపూర్ అడ్డాగా మారిందని ఓ అంతర్జాతీయ పత్రిక కథకనే ఇందుకు ఆధారమని సంచలన ఆరోపణ చేశారు.

దోచుకున్నా..
ఇతరుల డబ్బును కంపెనీలు దోచుకున్నా సింగపూర్ ప్రభుత్వం తమకు సంబంధించింది కాదన్నట్లుగా ప్రవర్తిస్తుందనడానికి గతంలో జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యాలు అని కృష్ణారావు అన్నారు.

ఆ డబ్బంతా సింగపూర్‌కు
శారదా స్కాం డబ్బు సింగపూర్ చేరిందని, ఇండోనేషియా, చైనాల నుంచి వచ్చిన డబ్బు మొత్తం సింగపూర్‌కు తరలి వెళ్లిందని పలు అంతర్జాతీయ పత్రికలు, ఎన్జీవోలు పేర్కొన్నాయని కృష్ణారావు చెప్పారు. అన్ని ఆరోపణలు ఉన్న సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను తెగతెంపులు చేసుకోవాలని చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు.

ఆలస్యమైతే.. బాబుకు కృష్ణారావు హెచ్చరిక
ఇప్పుడే తెగతెంపులు చేసుకోవాలని, ఆలస్యమైతే ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి వారికి పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని కృష్ణారావు హెచ్చరించారు. ఒప్పందాల రద్దు అనంతరం రాజధానికి అడ్డంకిగా ఉన్న గ్రీన్ ట్రైబ్యునల్ వివాదం, భూసేకరణలను ముందుగా పూర్తి చేయాలన్నారు. హడావుడిగా ఎవరికో ఒకరికి రాజధాని బాధ్యతను అప్పగించేబదులు అంతర్జాతీయ బిడ్‌లను ఆహ్వానించి సరైన నిర్మాణదారును ఎంపిక చేయాలన్నారు.












Click it and Unblock the Notifications