Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏరు దాటాక తెప్ప తగలేసే రకం: బాబుతో పొత్తుపై ఏపీ బీజేపీలో కలవరం

Chandrababu Naidu: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.

అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నారు.

IYR Krishna Rao made key remarks on TDP plans alliance with BJP

బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఆమె పొత్తు వ్యాఖ్యలు చేశారు. పొత్తు ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఒక్కరోజులోనే వెనక్కి వచ్చారు.

అనుకున్న దాని కంటే ఎక్కువగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను తమకు కేటాయించాల్సి ఉంటుందంటూ అమిత్ షా తేల్చి చెప్పారనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షా పెట్టిన ప్రతిపాదనలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తోన్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తోన్నారు.

చంద్రబాబు సాగిస్తోన్న ఈ పొత్తు ప్రయత్నాలు అటు నిఖార్సయిన ఏపీ బీజేపీ నేతలను కొంత మేర ఆందోళనకు గురి చేస్తోన్నాయి. చంద్రబాబుతో గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటోన్నారు. 1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీతో పొత్తు కలిసొచ్చిందనేది బహిరంగ రహస్యం.

IYR Krishna Rao made key remarks on TDP plans alliance with BJP

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటికొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించిన సందర్భాలు లేకపోలేదు. భార్యను సరిగ్గా చూసుకోలేని వాడు దేశాన్ని ఏం పాలిస్తాడంటూ నిండు అసెంబ్లీలో మోదీపై వ్యక్తిత్వ హననానికి దిగారు చంద్రబాబు. తిరుపతికి వచ్చిన అమిత్ షా కారుపైనా రాళ్లు వేయించారనే ఆరోపణలు ఉన్నాయి.

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో మళ్లీ బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఈ పరిణామాలు ఏపీ బీజేపీ నేతలను ఆందోళన పరుస్తోన్నాయి. బీజేపీ ఆసరాతో ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించితే.. చంద్రబాబు ఆ తరువాత మళ్లీ యూటర్న్ తీసుకుంటాడనే అభిప్రాయం వారిలో బలంగా నాటుకుపోయింది.

IYR Krishna Rao made key remarks on TDP plans alliance with BJP

ఈ పరిణామాలపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ సారి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో పాటు అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందని హితవు పలికారు. ఏరు దాటిన తరువాత కూడా నావతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+