జే గ్యాంగ్ వేధింపులకు గిరిజన మహిళ రైతు బలి:అప్పు తీర్చలేదని ట్రాక్టర్‌తో తొక్కించడంతో...
రాష్ట్రంలో జే గ్యాంగ్ వేధింపులు ఎక్కువవుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జే గ్యాంగ్ కాల్ మనీ వేధింపులతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పారు. ఇందుకు నిన్న చనిపోయిన మహిళ రైతు రమావంత్ మంత్రూభాయ్ సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. తీసుకున్న అప్పు తీర్చలేదని.. రమావంత్‌ను ట్రాక్టర్‌తో తొక్కియడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలకు ఇదీ పరకాష్ట అని విమర్శించారు.
రూ.3.80 లక్షల అప్పు..
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివాపురంలో గిరిజన మహిళ రమావంత్ మంత్రూభాయి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే ఆమె వైసీపీ నేత వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తన భూమి తాకట్టు పెట్టి తీసుకుంది. తీసుకున్న రూ.3.80 లక్షల అప్పు, వడ్డీ చెల్లించలేకపోయింది. ఇంకేముంది అప్పుచ్చిన శ్రీనివాస ఆగ్రహావేశానికి లోనయ్యాడు. అప్పు ఇస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు.
పొలంలో పనిచేసుకుంటుండగా..
సోమవారం తన పొలంలో రమావంత్ పనిచేసుకుంటున్నది. ఇంతలో అక్కడికి శ్రీనివాస్ మనుషులు వచ్చారు. అప్పు తీర్చాలని మాట మాట పెరిగింది. కానీ ఆమె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దీంతో ట్రాక్టర్‌తో తొక్కించాడు. తీవ్రగాయాలైన మహిళ రమావంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పలువురికి కలచివేసింది.

రెచ్చిపోతున్న వైసీపీ గుండాలు: లోకేశ్
రాష్ట్రంలో వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. అప్పు తీర్చలేదని మహిళ రైతును ట్రాక్టర్‌తో తొక్కించడం ఏంటీ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు అధికారం తలకెక్కి ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన మహిళ రైతు రమావంత్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Recommended Video

చంపడానికి లైసెన్స్ ఇచ్చారా..? టీడీపీ అనిత
ఘటనను టీడీపీ మహిళా నేత అనిత కూడా ఖండించారు. రెడ్డి గారు మరో ఎస్టీ మహిళను చంపించారు ఉందా అని ఫైరయ్యారు. అసైన్డ్ భూమి తాకట్టుపెట్టుకోవడం నేరం.. అప్పు తీర్చలేదని ట్రాక్టర్ ఎక్కించి చంపడం అంతకన్నా ఘోరం అని మండిపడ్డారు. కానీ జగన్ రాజ్యంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. మనుషులను చంపేందుకు వారికి లైసెన్స్ ఏమైనాఇచ్చారా అని మండిపడ్డారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications