ఎన్డీయేలో చేరికపై తేల్చేసిన తెరాస: కేసీఆర్‌కు బాబు ఫోన్, గ్రీటింగ్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్డీయేలో చేరుతుందని వస్తున్నా వార్తల పైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంగళవారం స్పందించారు. తమ పార్టీకి ఎన్డీయేలో చేరే ఆలోచన లేదని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో ఉండాలని ఆలోచించలేదన్నారు.
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. తాము ఎన్డీయేలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మహాత్మా గాంధీ, మండేలాల తర్వాత అహింసా మార్గంలో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చిన ఘతన కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ఉద్యమం కేసీఆర్ చేశారన్నారు.
మోడీకి రఘువీరా లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి లేఖ రాశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పదేళ్లపాటు పన్ను రాయితీలలో ఏదీ అమలు కాలేదని ఆయన చెప్పారు. విభజనతో నష్టపోయిన ఏపీని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.
విభజన హామీలను రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. బిల్లులో ఏమైనా లొసుగులు ఉంటే సరిదిద్దాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మద్దతును తాము కోరుతామని చెప్పారు.

కేసీఆర్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ముంబై పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications