జగన్ పార్టీ కోసమే పనిచేశారు: కాల్ మనీ ఇష్యూపై గాలి లాజిక్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని, జగన్ చరిత్రే నేరమయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంగళవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

కాల్ మనీ నేరగాళ్లలో ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే ఉన్నారని, ఎన్నికలకు ముందు వారంతా వైయస్సార్ కాంగ్రెసు కోసమే పనిచేశారని ఆయన అన్నారు. కాల్ మనీని ఉక్కుపాదంతో అణచి వేస్తామని చెప్పారు.

Jagan accused in 11 cases: Muddukrishnama Naidu

జగన్‌తో మందకృష్ణ భేటీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం హైదరాబాదులోని లోటస్ పాండులో ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు ఆయన భేటీ అనంతరం మీడియాతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాటన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్దీకరణ అంశాన్ని శాసనసభా సమావేశాల్లో లేవనెత్తాలని తాను జగన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+