వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇటు సమీక్ష,- అటు డిమాండ్లు- పోలవరంపై ఒకే రోజు జగన్, చంద్రబాబు స్పందన

|
Google Oneindia TeluguNews

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఇవాళ ఏపీలో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు వేర్వేరుగా స్పందించారు. ఒకరు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత దీనిపై తగు సూచనలు చేయగా.. మరొకరు మహానాడు వేదికగా ప్రభుత్వం ముందు ప్రాజెక్టుపై డిమాండ్లు వినిపించారు. ఈ మధ్య కాలంలో ఇలా ఒకే రోజు జగన్‌, చంద్రబాబు ఒకే విషయంపై రెండు వేర్వేరు వేదికల నుంచి స్పందించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

పోలవరంపై ఒకే రోజు స్పందించిన జగన్, చంద్రబాబు

పోలవరంపై ఒకే రోజు స్పందించిన జగన్, చంద్రబాబు

పోలవరం జాతీయ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇవాళ సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు వేర్వేరుగా స్పందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని అధికారుల్ని సీఎం జగన్ కోరగా.. ఇటు ఆన్‌లైన్లో జరుగుతున్న టీడీపీ మహానాడులో మాట్లాడిన చంద్రబాబు.. కూడా ప్రభుత్వం ముందు ఇదే డిమాండ్‌ పెట్టారు. అయితే అధికారులకు జగన్‌ సీఎం హోదాలో తగు సూచనలు చేయగా... చంద్రబాబు మాత్రం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

పోలవరంపై జగన్‌ సమీక్ష

పోలవరంపై జగన్‌ సమీక్ష


పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సీఎం జగన్‌.. ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అని అధికారులకు చెప్పారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇఛ్చారు. కేంద్రం వద్ద దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇలా రాష్ట్రం పెట్టిన ఖర్చుకు బిల్లురలు పెండింగ్‌లో ఉంచడం సరికాదని జగన్ తెలిపారు. ఢిల్లీ వెళ్లి వెంటనే బిల్లులు రీయింబర్స్‌ అయ్యేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, కాబట్టి పనులు ఆగకుండా చూడాలన్నారు.

 పోలవరంపై చంద్రబాబు డిమాండ్‌

పోలవరంపై చంద్రబాబు డిమాండ్‌

పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఒడిశా సరిహద్దుల వరకు నీటిని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. తమ హయాంలో 69 ప్రాజెక్టులకు 24 ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ఒక్క ఎకరం భూ సేకరణ చేశారా ? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే

జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే

పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే విషయంలో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు ఒకే రోజు ఒకే వాయిస్‌ వినిపించారు. ఒకరు అధికారులకు సూచన రూపంలో, మరొకరు ప్రభుత్వానికి డిమాండ్ రూపంలో ఇదే విషయం చెప్పారు. అయితే గత టీడీపీ ప్రభుత్వానికీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికి తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పోలవరంపై ప్రతీ సోమవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేయకుండానే తన పదవీకాలం పూర్తి చేసుకోగా.. ఇప్పుడు వైసీపీ సర్కారులో సీఎం జగన్ మాత్రం అప్పుడప్పుడూ సమీక్షలు నిర్వహిస్తున్నా పనులకు ఆటంకం లేకుండా చూస్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తయ్యే పరిస్ధితులున్నాయి.

Recommended Video

Narsapuram Mp కేసులో ట్విస్ట్, HRC సీరియస్..!!

English summary
andhapradesh cm ys jagan and opposition leader chandrababu on today reacts on polvaram project progress. jagan reviews the project progress and naidu demands completion of the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X