జాతీయ నేత‌లు గుంపుగా వ‌చ్చినా : జ‌గ‌న్ సింగిల్ గానే : న‌గ‌రి స‌భ‌లో రోజా ఫైర్‌...!

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు. నాటి ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పు మ‌రోసారి పునరా వృతం చేయ‌వ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. నాడు క‌లిసి పోటీ చేసిన వారు...ఇప్పుడు విడివిడిగా క‌లిసే పోటీ చేస్తున్నార‌ని తీ వ్ర వ్యాఖ్య‌లు చేసారు. పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్ జ‌గ‌న్ అంటూ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు.

జ‌గ‌న్ సింగిల్ గానే..

జ‌గ‌న్ సింగిల్ గానే..

న‌గ‌రి వైసిపి అభ్య‌ర్ది రోజా టిడిపి అధినేత ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో చంద్ర‌బాబు ల‌క్ష్యంగా విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ ఈ రోజు పుత్తూరు లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. ఆ స‌భ‌లో రోజా పంచ్ ల‌తో డైలాగులు పండించారు.
చంద్ర‌బాబు జాతీయ నేత‌ల‌ను తీసుకొచ్చినా..వారంతా గుంపుగా వ‌చ్చినా..జ‌గ‌న్ సింగిల్ గానే పోటీ చేస్తార‌ని.. గెలిచి చూపిస్తార‌ని స్ప‌ష్టం చేసారు. రాయల‌సీమ బిడ్డ‌..అసెంబ్లీ టైగ‌ర్‌..పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్ అని జ‌గ‌న్ పై ప్ర‌శంస‌లు కురి పించారు. కరువు రావాలంటే చంద్రబాబు రావాలి.. ఎరువు కావాలంటే జగన్‌ రావాలని వైఎస్సార్‌సీపీ నగరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆర్కే రోజా స్పష్టం చేశారు. చంద్రబాబును ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని తెలిపారు.

బాబు సొంత జిల్లాకే ఏం చేయ‌లేదు..

బాబు సొంత జిల్లాకే ఏం చేయ‌లేదు..

చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినా సొంత జిల్లాకు చేసిందేంలేదని రోజా మండిపడ్డారు. జాతీయ నాయకులు అప్పుడు కలిసొచ్చారు.. ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు.. పొత్తు మాత్రం సేమ్‌ టూ సేమ్‌ అంటూ దుయ్యబట్టారు. తె లుగువాడి గుండె ధైర్యం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలోనే నగరి నియోజకవర్గం అభి వృద్ధి చెందిందని గుర్తు చేశారు. గాలేరు - నగరి ప్రాజెక్ట్‌ పూర్తయితేనే పుత్తూరులో నీటి సమస్య తీరుతుందని స్పష్టం చేశారు. 2014 లో త‌ప్పు చేసార‌ని..ఆ త‌ప్పు తిరిగి చేయ‌వ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. అధికారం కోసం బాబు అడ్డమైన గడ్డి తింటూ.. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు భార్య ఆస్తులు మాత్రం ఐదు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఓ వైపు చిత్తూరులో చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతుంటే.. బాబు కోడలు మాత్రం ఐస్‌క్రీమ్‌ కంపెనీలు ప్రారంభిస్తున్నారని తెలిపారు.

రోజాను అందుకే స‌స్పెండ్ చేసారు..

రోజాను అందుకే స‌స్పెండ్ చేసారు..

వైసిపి అధినేత జ‌గ‌న్ పుత్తూరు స‌భ‌లో న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రించారు. చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి వ‌స్తే ప్ర‌భు త్వ పాఠ‌శాల‌లు మూసివేస్తార‌ని..త‌న‌కు అడ్డువ‌చ్చిన వారికి బ‌త‌కనీయ‌ర‌ని ఆరోపించారు. మ‌హిళా స‌మ‌స్య‌ల పై స‌భ లో పోరాడినందుకు రోజాను స‌భ నుండి సస్పెండ్ చేసార‌ని గుర్తు చేసారు. సొంత జిల్లాకు చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేక పోయార‌ని ఎద్దేవా చేసారు. పాదయాత్ర‌లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేస్తున్నాన‌ని హామీ ఇచ్చారు. టిడిపి వారే హ‌త్య చేయించి..కుటుంబ స‌భ్యుల మీద‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు కు ఓటు వేస్తే సంక్షేమం ఆగిపోతుంద‌ని వివ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+