జగన్ ఆస్తుల కేసు ఛార్జిషీట్లు- ఈడీ ముందా ? సీబీఐ ముుందా ? సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ముందుగా విచారణ చేపట్టాలా లేక సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపైనా అనే అంశం త్వరలో తేలిపోనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ముందుగా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ ప్రారంభించేందుకు సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నిందితులకు చుక్కెదురైంది. దీంతో ఇప్పుడు వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో త్వరలో జగన్ ఆస్తుల కేసులో ఛార్జిషీట్లపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడనుంది.

కీలక దశకు జగన్ కేసుల విచారణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా భారీ ఎత్తున ఆర్ధిక అక్రమాలకు పాల్పడినట్లు జగన్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో జగన్ తో పాటు పలువురు మాజీ మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులు నిందితులుగా ఉన్నారు. దాదాపుగా పదేళ్లుగా సీబీఐతో పాటు ఈడీ కూడా ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో సీబీఐతో పాటు ఈడీ కూడా పలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. వీటిపై త్వరలో సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఇది మొదలైతే కేసు తుది దశకు చేరుకునట్లేనని భావిస్తున్నారు.

సీబీఐ ముందా ? ఈడీ ముందా
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులపై ఇప్పటికే హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో సీబీఐ, ఈడీ పలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. వీటిలో ఏ ఛార్జిషీట్లపై ముందుగా విచారణ చేపట్టాలనే విషయంలో నిందితుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటిలో ముందుగా ఈడీ ఛార్జిషీట్లపైనే విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయంపై ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముందుగా సీబీఐ ఛార్జిషీట్లపై విచారణ జరపాలని, లేదంటే సీబీఐ, ఈడీ రెండు ఛార్జిషీట్లపైనా ఏకకాలంలో విచారణ జరపాలని సీబీఐ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు .. వీరి వాదనను తిరస్కరించింది.

హైకోర్టులోనూ చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులపై సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేసినా ముందుగా ఈడీ ఛార్జిషీట్లపైనే విచారణ జరపాలని సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని నిందితులు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. సీబీఐ కోర్టులతో సంబంధం లేకుండా జగన్ అక్రమాస్తుల కేసులో దాఖలైన ఈడీ ఛార్జిషీట్లపై సీబీఐ కోర్టు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులు ఈ కేసుల్లో నిందితులకు భారీ షాక్ గా మారాయి. దీనిపై తదుపరి ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాల అనంతరం నిందితులు మరో నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ముందుగా విచారణ ప్రారంభించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించడంతో ఇక దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు నిందితులు సిద్ధమయ్యారు. హైకోర్టు నిర్ణంతో సీబీఐ కోర్టులో ఈడీ ఛార్జిషీట్లపై విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తిరిగి హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డితో పాటు జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ లిమిటెడ్ లు సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశాయి. దీంతో ఈడీ ఛార్జిషీట్లపై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 9 వరకూ వాయిదా వేసింది.

సుప్రీం నిర్ణయంపైనే ఆశలు
జగన్ ఆస్తుల కేసులో ఈడీ ఛార్జిషీట్లపై ముందుగా విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయంపై నిందితులు సుప్రీంకోర్టులో త్వరలో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్ధించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టు కూడా ముందుగా ఈడీ ఛార్జిషీట్లపైనే విచారణ జరపాలని ఆదేశాలు ఇస్తే మాత్రం జగన్, విజయసాయిరెడ్డి సహా మిగతా నిందితులందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలా కాకుండా సుప్రీంకోర్టు.. రెండు ఛార్జిషీట్లపై ఏకకాలంలో విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చినా, లేక సీబీఐ ఛార్జిషీట్లనే ముందుగా విచారణ నిర్వహించాలని ఆదేశించినా జగన్ కేసుల్లో నిందితులకు ఊరట దక్కడం ఖాయం. అందుకే ఇప్పుడు వీరంతా సుప్రీం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈడీ ఛార్జిషీట్లపై ముుందు విచారణ ఎందుకు వద్దు ?
అసలు ఈడీతో పాటు సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఇవాళ కాకపోతే రేపైనా సీబీఐ కోర్టు విచారణ జరపక తప్పదు. ఈ వ్యవహారంలో తీర్పులూ రాక తప్పదు. మరి అలాంటప్పుడు నిందితులు ఇప్పుడు ఈడీ కేసుల్లో ఛార్జిషీట్లపై విచారణ ముందుగా జరగకూడదని ఎందుకు కోరుకుంటున్నారనే దానిపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇందులో ఓ వాదన ప్రకారం ముందుగా ఈడీ ఛార్జిషీట్లపై విచారణ పూర్తయితే ఇందులో వేగంగా శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీబీఐ కేసులతో పోలిస్తే ఈడీ కేసుల్ని, అందులోనూ ఆర్ధిక అక్రమాలతో కూడుకున్న కేసులు కావడంతో వీటి విచారణ కూడా వేగంగా సాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అనతి కాలంలోనే నిందితులు జైలుకు వెళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయి. అదే సీబీఐ ఛార్జిషీట్ల విచారణ ముందుగా మొదలైతే, లేదా ఈడీ ఛార్జిషీట్లతో కలిపి వీటిని విచారిస్తే మాత్రం వీటిపై విచారణను పొడిగింపులు కోరే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. అందుకే నిందితులంతా ఇప్పుడు ఈడీ ఛార్జిషీట్లపై ముందుగా విచారణ కోరుకోవడం లేదని సమాచారం. కానీ సుప్రీంకోర్టు దృష్టిలో మాత్రం ఈ రెండు ఛార్జిషీట్లు ఒకేలా ఉంటాయని, అత్యున్నత న్యాయస్ధానానికి మాత్రం ఈ ఛార్జిషీట్లను లింక్ చేసే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications