జగన్ ఆటమ్ బాంబులొచ్చాయ్! పండగ ఇక మామూలుగా కాదు!!
అమరావతి: దీపావళి పండగ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి పండగంటే దీపాల పండగ. అంతేగాక, బాణాసంచా కాల్చుతూ యువత సంబరాలు జరుపుకుంటారు. అక్టోబర్ 25న సూర్య గ్రహణం ఉండటంతో సోమవారం దీపావళి పండగను చేసుకుంటున్నారు.
పండగ సందర్భంగా అనేక బాణాసంచా దుకాణాలు అన్ని చోట్లా వెలిశాయి. ఎప్పటి లాగే అనేక టపాసులు మార్కెట్లో వచ్చాయి. కానీ, ఈసారి మాత్రం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద కూడా టపాసులు రావడం విశేషం.

జగన్ ఆటమ్ బాంబుల పేరుతో బాణాసంచా దుకాణాల్లో టపాసులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. జగన్ పేరుతో టపాసులను చూసిన ఆయన అభిమానులు, వైసీపీ పార్టీ శ్రేణులు భారీగా కొంటున్నారు. దీంతో ఆ బాంబులను తీసుకొచ్చిన దుకాణాల్లోనూ సందడి నెలకొంది.












Click it and Unblock the Notifications