Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ జన్మదినం సాక్షిగా... కాసు వర్సెస్ జంగా ఆధిపత్య పోరు; దాచేపల్లిలో ఫ్లెక్సీల రగడ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేతలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. వాడవాడలా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు ఎటు చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లతో హడావుడి చేస్తున్నారు.

వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల రగడ

వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల రగడ

వైసీపీ నేతలు ఎవరికి వారు తమదైన శైలిలో తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు రెడీ కాగా, గుంటూరు జిల్లాలో మాత్రం వైసీపీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి లో వైసిపి నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వైసిపి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వైసీపీ నేతల మధ్య పంచాయితీని రచ్చకెక్కించింది.

ఎమ్మెల్యే కాసు మేష్ రెడ్డి వర్సెస్ జంగా కృష్ణ మూర్తి

ఎమ్మెల్యే కాసు మేష్ రెడ్డి వర్సెస్ జంగా కృష్ణ మూర్తి

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గీయులు తొలగించడం ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. గామాలపాడు సచివాలయం ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

జగన్ పుట్టినరోజు సందర్భంగా అదే ఫ్లెక్సీల స్థానంలో జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలను కట్టారు. దీంతో ఇరు వర్గాల వారి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము ఫ్లెక్సీలు కట్టిన స్థానంలో ఎమ్మెల్యే వర్గీయులు కావాలని ఫ్లెక్సీలను కట్టారని ఎమ్మెల్సీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

గురజాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య కుమ్ములాట

గురజాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య కుమ్ములాట

ఇదిలా ఉంటే చాలా కాలంగా గురజాల నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య కుమ్ములాట కొనసాగుతోంది. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన అనుచరులకే కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని, అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనేకమార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక నాయకుల మధ్య అధికార యంత్రాంగం నలిగిపోతోందని సమాచారం. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం వైసీపీ లో ఆధిపత్యపోరు కారణంగా నియోజకవర్గంలో అంతకు ముందు వరకు కలిసి ఉన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని టాక్ .

నియోజకవర్గంలో ఎమ్మెల్సీని పక్కనబెట్టి ఎమ్మెల్యే ఆధిపత్య ధోరణి

నియోజకవర్గంలో ఎమ్మెల్సీని పక్కనబెట్టి ఎమ్మెల్యే ఆధిపత్య ధోరణి

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలినాళ్లలో, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇరువురూ కలిసి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేవారు . అయితే ఆ తర్వాత నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులలో కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే వర్గీయులకు ఇప్పించుకోవడంతో పాటు, మైనింగ్ అనుమతులు కూడా కాసు తమ వారికే ఇప్పించుకోవటంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపాయి.

కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఫ్లెకీల వివాదంతో మారోమారు రచ్చ

కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఫ్లెకీల వివాదంతో మారోమారు రచ్చ

గురజాల నియోజకవర్గం లో తనకంటూ క్యాంపు కార్యాలయం లేని జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి తన కార్యకలాపాలు కొనసాగించే వారు . అయితే ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ తో జంగా కృష్ణమూర్తి పిడుగురాళ్ళ లో ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుండి రాజకీయాలు సాగిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయని పార్టీ శ్రేణులలో జోరుగా చర్చ జరిగింది. ఇక తాజాగా ఫ్లెక్సీ వివాదం తో ఇరువురు నేతల మధ్య ఉన్న వర్గ పోరు మరోమారు బయటపడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+